గోకరాజు గంగరాజుకు నోటీసులొచ్చాయి

December 12, 2019

కూల్చివేతల విషయంలో జగన్ సర్కారు ఇంకా చల్లబడలేదు. తాజాగా బీజేపీ ప్రముఖుడు గోకరాజు గంగరాజు ఇంటికి నోటీసులు ఇచ్చాు. కృష్ణా నది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలకు సీఆర్డీఏ వరుసగా రోజుకు కొందరకి నోటీసులు జారీచేస్తూ వస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేశ్, మంతెన సత్యనారాయణ సహా పలువురికి నోటీసులు జారీచేసిన సీఆర్డీఏ, తాజాగా మరో ఐదుగురికి నోటీసులు ఇచ్చింది.
కృష్ణా నది కరకట్ట పైన అక్రమంగా భవనాలను నిర్మించిన ఐదుగురికి సీఆర్డీఏ అధికారులు ఈరోజు నోటీసులు జారీచేశారు. నిర్దేశిత సమయంలోపు సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారిలో బీజేపీ మాజీ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజుతో పాటు నెక్కంటి వెంకట్రావు, వేదాద్రి మహర్షి తపోవనం, దివి సత్యసాయి, అట్లూరి శాంతిచంద్రలకు చెందిన భవనాలకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు అంటించారు. ఈ అక్రమ కట్టడాలపై వారం రోజుల్లోగా జవాబు చెప్పాలనీ, లేదంటే చట్టప్రకారం చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నారు.