హీరోయిన్ షాలిని పై క్రిమినల్ కేసు !!

May 30, 2020

అర్జున్ రెడ్డి భామ కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకుంది. తనకు వచ్చిన ఇమేజ్ తో ఇగోకి పోయి కేసు దాకా తెచ్చుకుంది. అగ్రిమెంట్ చేసుకున్న సినిమాలో చెప్పకుండా ఎగ్గొట్టినందుకు గాని ఆమెపై క్రిమిన్ కేసు నమోదు అయ్యింది. ఆమె నుంచి సరైన సంజాయిషీ లేకపోతే అరెస్టు అయ్యే అవకాశాలూ ఉన్నాయి.

షాలిని పాండే మొదటి సినిమా అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్. దానిని హిందీలోకి రీమేక్ చేసినా కూడా అది పెద్ద హిట్ అయ్యింది. అవకాశాలు వరుసగా రావడంతో ఆమె ఇష్టానుసారం వ్యవహరిస్తోందని విమర్శలు కూడా ఉన్నాయి. తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన నటించేందుకు సంతకం చేసి, కొన్నివారాల పాటు సజావుగా సెట్స్ కి వచ్చిందావడ. ఆ తర్వాత చెప్పకుండా షూటింగ్ కు ఎగ్గొట్టింది. దీంతో ఏర్పాట్లు చేసుకున్న నిర్మాతలు నష్టపోయారు. హీరో, ఇతర నటలు పారితోషికాలు వృథా అయ్యాయ్యని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఆమెను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో చిత్ర నిర్మాత శివ షాలినిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అంతకంటే ముందు నిర్మాత షాలినీపై తెలుగు, తమిళ నిర్మాతల మండలిలోనూ ఫిర్యాదు చేశారు.

షాలినీ ఇటీవలే బాలీవుడ్ లో నవతరం స్టార్ హీరో రణవీర్ సింగ్ పక్కన 'జయేశ్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. పెద్ద అవకాశం రావడంతో తమిళ సినిమాను నిర్లక్ష్యం చేసిందని టాక్ నడుస్తోంది. ఈ కేసు ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.