రాజకీయాల్లో ‘క్రిమినల్స్’...!

September 17, 2019

మనం ఎవరికి ఓటేస్తున్నామో.., మన పాలకులుగా ఎవరిని ఎన్నుకుంటున్నామో తెలుసా..? క్రిమినల్స్‌ను..! నమ్మలేకపోతున్నారా...?! ఈ కేసుల లెక్కలు ఒక్కసారి చూడండి.

చట్టసభలకు పెద్ద సంఖ్యలో నేర చరితులు పోటీ పడుతున్నారు. ఉత్తరాంధ్ర మినహా మిగిలిన పది జిల్లాల్లోని టీడీపీ, వైసీపీకి చెందిన 100 మందికి పైగా అభ్యర్థులపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో అత్యధిక కేసులు వైసీపీ అధినేత జగన్‌పై ఉన్నాయి. తనపై 31 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అఫిడవిట్లో ఆయనే పేర్కొన్నారు. ఆ తర్వాత, స్థానంలో దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. ఆయనపై 26 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జగ్గయ్యపేట వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభానుపై 18, చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై 16, పెడన వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్‌పై 16, చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై 15 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
6 నుంచి 10 కేసులున్న వారు...
తాడిపత్రి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఎనిమిది, గుంటూరు తూర్పు వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ముస్తాఫా షేక్‌పై ఎనిమిది, మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఏడు, సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్‌రెడ్డిపై ఏడు, ధర్మవరం వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై ఏడు, రాయదుర్గం టీడీపీ అభ్యర్థి దీపక్‌రెడ్డిపై ఏడు, పెనమలూరు వైసీపీ అభ్యర్థి కె.పార్థసారధిపై ఏడు, వినుకొండ వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుపై ఆరు, రాజోలు వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై ఆరు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
3 నుంచి 5 కేసులున్న వారు...
ఉదయగిరి టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావుపై ఐదు, కమలాపురం వైసీపీ అభ్యర్థి పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డిపై ఐదు, పెనుగొండ వైసీపీ అభ్యర్థి ఎం.శంకర్ నారాయణపై ఐదు, రాప్తాడు వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై ఐదు, రాయదుర్గం వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డిపై ఐదు, నందిగామ వైసీపీ అభ్యర్థి జగన్మోహనరావుపై ఐదు, జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి మూలే సుధీర్‌రెడ్డిపై నాలుగు, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై నాలుగు, నగరి వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజాపై నాలుగు, కోవూరు టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై నాలుగు, పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీశ్‌రెడ్డిపై నాలుగు, చిత్తూరు వైసీపీ అభ్యర్థి శ్రీనివాసులుపై నాలుగు, ఉరవకొండ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై నాలుగు, ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌పై నాలుగు, గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నంపై నాలుగు, మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నాలుగు, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నానిపై నాలుగు, జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై మూడు, ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై మూడు, ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డిపై మూడు, నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై మూడు, పుట్టపర్తి వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మూడు, ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డిపై మూడు, మైలవరం వైసీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్‌పై మూడు, అవనిగడ్డ వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేశ్‌బాబుపై మూడు, కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావుపై మూడు, రామచంద్రాపురం టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుపై మూడు, కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై మూడు, కొత్తపేట వైసీపీ అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డిపై మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెనుకొండ టీడీపీ అభ్యర్థి బీకేపార్థసారధి గతంలో మూడు కేసుల్లో దోషిగా తేలారు. ప్రస్తుతం ఒక క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉంది. టీడీపీ, వైసీపీల్లో ఇంకా చాలామందిపై ఒకట్రెండు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.