దేశమంతటా కర్ఫ్యూ !!

August 14, 2020

అవును... బయట ఎవరూ తిరగడం లేదు. అంతటా కర్ఫ్యూ వాతావరణమే. కానీ ఈ కర్ఫూ విధించింది ప్రభుత్వం కాదు, ప్రకృతి. గ్రహణాల్లోనే ఇది కొంచెం అరుదైన చూడామణి గ్రహణం. సాధారణంగా గ్రహణాలు గంట గంటన్నర ఉంటాయి. కానీ ఈ గ్రహణం మూడున్నర గంటలు ఉంటుంది.

హిందూ శాస్త్రాల ప్రకారం ఒక్కోసారి కొన్నిరాశుల వారు గ్రహణాన్ని కొందరు చూడకూడదు. అయితే మూఢ నమ్మకాలు పెరిగిపోయి అందరూ గ్రహణం చూడటం మానేశారు. దీంతో దేశమంతటా జనం బయటకు రాకుండా ఇళ్లలోనే ఉన్నారు. దుకాణాలు మూసేశారు. దీంతో దేశమంతటా కర్ప్యూ వాతావరణం ఏర్పడింది. గర్భిణులు గ్రహణాన్ని ఎపుడూ చూడకూడదు. 

సూర్య గ్రహణం సూర్యుడికి భూమికి చంద్రుడు అడ్డు రావడం వల్ల ఏర్పడుతుంది. సూర్యుడి కంటే చంద్రుడు చాలా చిన్న సైజులో ఉంటాడు కాబట్టి కొన్ని ప్రాంతాల్లోనే సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది.