మహానేత కోసం దగా పడ్డ దళిత గుండె

May 27, 2020

తండ్రి ని చంపిన అంబానీకి సన్మానం ...

మహానేతను మట్టు పెట్టిన కుటుంబానికి రాజ్యసభ సీటు...

రంగం సినిమా ని తలపించేలా ఉంది అంటూ వైకాపా కి మద్దతు ఇస్తున్న దళిత వర్గాల్లో చర్చ...

మహానేత ప్రమాదంలో చనిపోయారు అని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.కానీ అది ప్రమాదం కాదు దాని వెనుక మహా కుట్ర ఉందని జగనన్న ఆరోపించారు.రిలయన్స్ గ్రూప్ అధినేత అంబానీ,ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ రావు,టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి మహానేత ని మట్టుపెట్టారు అని ఆరోపించారు.గోదావరి గ్యాస్ నిక్షేపాలు కొల్లగొట్టడానికి రిలయన్స్ గ్రూప్ కి గంపగుత్తగా చంద్రబాబు అనుమతులు కేటాయించారు అని,ఈ డీల్ క్లోజ్ చేసింది రామోజీ రావు అని జగన్ ఆరోపించారు.ఆ తరువాత అధికారంలోకి వచ్చిన మహానేత గోదావరి గ్యాస్ దోపిడీ ని ఆపడానికి ప్రయత్నించారు.లక్షల కోట్లు దోపిడీ ఆపినందుకు ఆ ముగ్గురు కలిసి వైఎస్ఆర్ ని చంపారు అని జగన్ తో సహా వైకాపా నేతలు ఆరోపించారు.సాక్షి పత్రికలోనూ,టీవీలోనూ అనేక వార్తలు ఇచ్చారు.వైఎస్ఆర్ ని దైవంగా భావించిన దళిత యువత ఈ పరిణామాలతో ఆగ్రహావేశాలకు గురైయ్యారు.కనిపించిన రిలయన్స్ ఆస్తుల పై దాడి చేసారు.దాదాపు 100 కోట్ల విలువైన రిలయన్స్ ఆస్తులు ఆ దాడుల్లో ధ్వంసం అయ్యాయి.రెండు రాష్ట్రాల్లో 1029 మంది దళితుల పై కేసులు నమోదు అయ్యాయి.9 ఏళ్ల నుండి దళిత యువత రిలయన్స్ సంస్థ పెట్టిన కేసులకు కోర్టుల చుట్టూ తిరుగుతూ నలిగిపోతున్నారు.పార్టీ నుండి ఆర్థికంగా ఆదుకుంది కూడా ఏమి లేదు.అయినా మహా నేత పై ఉన్న అభిమానంతో ఓర్పుగా ఉన్నారు.జగనన్న అధికారంలోకి వస్తారు అంబానీ,రామోజీ,చంద్రబాబు కుట్ర ని బయట పెట్టి వారిపై చర్యలు తీసుకుంటారు అని దళిత లోకం భావించింది.కానీ అందుకు భిన్నంగా జరుగుతున్న పరిణామాలు విస్మయం కలిగించాయి.తండ్రి ని చంపిన వాడిని పిలిచి సన్మానం చెయ్యడం,అతని ఆప్తుడు నత్వానికి రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని వైఎస్ ని ప్రేమించిన దళిత లోకం తట్టుకోలేకపోతుంది.వైఎస్ మరణం వెనుక కుట్ర నిజం కాదా?మరి ప్రమాదం ఎలా జరిగింది?ప్రమాదం వెనుక ఉన్న నిజం ఏంటి? తండ్రి ని చంపిన వ్యక్తిని కౌగిలించుకోవడం సాధ్యమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇన్నాళ్లు జగన్ కి వెన్నుముకలా వ్యవహరించిన దళిత వర్గాన్ని వేధిస్తున్నాయి.

పుండుపై కారం చల్లినట్టు పరిమాల్ నత్వాని పెట్టిన ట్వీట్ ఇప్పుడు కాకరేపుతోంది.రాజ్యసభ సీటు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అందుకు సిఫార్సు చేసిన మోడీ,అమిత్ షా కి కూడా ధన్యవాదాలు తెలిపారు నత్వాని.ఈ మొత్తం పరిణామాలు చూస్తున్న వైకాపా దళిత మద్దతుదారులు డోలాయమానం లో పడ్డారు.జగన్ బీజేపీతో కలిసిపోయారు.స్థానిక సంస్థల ఎన్నికలు,2024 లో వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ తో వైకాపా పొత్తు ఉంటే మన పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు.అంతే కాదు మహానేత విషయంలోనే జగన్ చేసిన ఆరోపణలు నిజం కాకా పోతే.కోడికత్తి కేసు,బాబాయ్ వివేకా హత్య కేసు లో జగన్,వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలు అన్ని బుస్సేనా అనే చర్చ జరుగుతుంది.ఆఖరికి కొంత మంది పార్టీ మద్దతు దారుల చర్చల్లో ఇదంతా చూస్తుంటే రంగం సినిమా గుర్తు వస్తుంది అని మాట్లాడుకుంటున్నారు.పార్టీ అధిష్టానం మాత్రం ఏమి పట్టనట్టు అంబానీ సేవలో పవళిస్తుంది.