అచ్చెన్నాయుడు ఆరోగ్యం... గవర్నమెంటు ట్విస్టులు ! 

August 08, 2020

ఒక శాసన సభ్యుడిని ఒక పద్ధతి, విధానం లేకుండా గోడలు దూకి అరెస్టు చేశారు పోలీసులు. ఆయనకు అరెస్టు నోటీసులు ఇస్తే ఆయనే వచ్చి లొంగిపోతారు. కానీ టెర్రరెస్టులను పట్టుకున్నట్లు పట్టుకున్నారు. అమానవీయంగా ఆపరేషను అయ్యి పచ్చి గాయంతో ఉన్న అచ్చెన్నాయుడి ఆరోగ్యం గుర్తించకుండా వందల కిలోమీటర్లు తిప్పారు పోలీసులు. 

అతని ఆరోగ్యంపై భారీగా ఆందోళన వ్యక్తం కావడంతో, అందరూ నిలదీయడంతో... ఎక్కడ మానవ హక్కుల కేసు అవుతుందో అని ప్రభుత్వం వెనుకడుగు వేసి ఇపుడు కబుర్లు చెబుతోంది. 

ముఖ్యమంత్రి జగన్ దీని గురించి మాట్లాడుతూ అతను కోరుకున్న చోట వైద్యం చేయించాలని సూచించారట. ఒక వ్యక్తిని అరెస్టు చేసేటపుడు, పైగా గతంలో ఏ కేసులు లేని వ్యక్తి. కనీసం ఆరోగ్య పరీక్షలు చేయకుండా 500 కిలోమీటర్లు తిప్పి పరీక్షలు చేయడం ఏమిటి?

 

చివరకు ఏసీబీ కోర్టు అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి 14 రోజులు రిమాండ్ విధించినా కూడా... జైలుకు కాకుండా ఆస్పత్రికి తరలించమని సూచించింది.

ఈ వ్యవహారంపై గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందన విచిత్రంగా ఉంది. 

అచ్చెన్నాయుడును వందల కిలోమీటర్ల వాహనాల్లో తిప్పడం వల్ల ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందన్నారు. గాయానికి చికిత్స అందిస్తున్నామని... అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని చెప్పారు. 

మరీ ఇంత హీనమా... మనిషి ప్రాణానికి విలువ లేదా? ఆరోగ్యాన్ని నిర్లక్ష్యంతో పాడు చేసిన ఇంజెక్షన్ వేస్తామని చెప్పినంత ఈజీగా అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని చెప్పడం ఎంత అమానవీయం, దారుణం?  

పాలకులకు ఎంత అధికారం ఉంటే మాత్రం మానవత్వం, ప్రాథమిక హక్కులు కూడా ఉల్లంగిస్తారా?