అల్లు అర్జున్ కి అలా కలిసొచ్చింది !

August 06, 2020

డ్యాన్స్ లో అల్లు అర్జున్ గ్రేస్,

మ్యూజిక్ లో థమన్ క్రియేషన్ 

ఈ రెండింటి కాంబినేషన్లో అల వైకుంఠపురంలో పాటలు ఎంత హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే... సావజవరగమన ఆడియోలో అదరగొడితే బుట్టబొమ్మ వీడియోలో అదరగొట్టింది. బుట్ట బొమ్మ కంటెస్ట్, ఛాలెంజ్ అంటూ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. తాజాగా ఈ పాటకు మరింత గౌరవం దక్కింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బుట్ట బొమ్మ సాంగ్ కు డ్యాన్స్ చేసి టిక్ టాక్ వీడియో చేశాడు. అందులో వార్నర్ తో వాళ్లావిడను కూడా లాగేసుకుని డ్యాన్స్ చేయడం అందరినీ తెగ ఆకట్టుకుంది. 

వెనుక వారి బుడ్డోడు అటూ ఇటూ తిరుగుతూ తను డ్యాన్స్ చేశాడు. ఈ క్యూట్ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో తెగ ట్రెండ్ అవుతోంది.