దావూద్ ఇబ్రహీం... చనిపోయాడా? లేదా?

August 11, 2020

ముంబైలో మృత్యువుతో నాట్యం చేయించి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మృత్యువు బారిన పడ్డారా? భారతదేశపు చట్టంలో ఉరి శిక్ష అనుభవించాల్సిన అతనికి కరోనా మరణ శిక్ష విధించిందా? ఈ ప్రశ్నలు ఇపుడు టాక్ ఆఫ్ ద వరల్డ్. దావూద్ ఇబ్రహీంకి కరోనా వైరస్ సోకినట్లు వార్తలు నిన్న హల్ చల్ చేశారు. పాక్ ప్రభుత్వ వర్గాల నుంచే ఈ వార్త బయటకు వచ్చిందని ప్రముఖ పాకిస్తాన్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే...ఈరోజు అతను చనిపోయాడన్న వార్త న్యూస్ ఎక్స్ ఛానెల్ తమ ట్విట్టరు అక్కౌంట్లో పేర్కొంది. అతను కరోనాతో మృతి చెందినట్లు తమకు సమాచారం ఉందని ఆ మీడియా పేర్కొంది.

మరోవైపు అతని తమ్ముడు అనీస్ ఇబ్రహీం దీనిపై స్పందించారు. తన అన్నకు, వదినకు ఏం కాలేదన్నారు. వారిద్దరికీ కరోనా రాలేదని, ఇద్దరు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే అనీస్ తాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నది చెప్పలేదు. దావూద్ ఇప్పటికీ పాక్, యుఏఈలలో వ్యాపారాలు చేసుకుంటున్నాడన్నారు. ఎవరూ అడక్కపోయినా అతను వ్యాపారాల గురించి ప్రస్తావించడం చూస్తుంటే... కచ్చితంగా దావూద్ చనిపోయాడనే విషయం అర్థమవుతోంది.

దావూద్ చనిపోవడంతో తమ్ముడు వ్యాపారాలు చేసుకుంటున్నాడని... తన జోలికి ఎవరూ రాకుండా అన్న పేరును వాడుకోవడానికే ఇలా స్పందించాడని అన్న అనుమానాలు కూడా గట్టిగా ఉన్నాయి. దావూద్ కు బీపీ షుగర్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో కరోనా సోకి రెండు రోజుల్లోనే అతను మృతి చెందినట్లు పాక్ వర్గాల ద్వారా తెలిసిందని ఇండియన్ మీడియా పేర్కొంటోంది. మొత్తానికి ముంబైలో మారణ హోమం సృష్టించిన ఇతను భారత చట్టాల నుంచి తప్పించుకోవడం శోచనీయం.