ప్రెస్ మీట్లో క‌న్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్

August 03, 2020

కెరీర్ ఆరంభంలో గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్న‌ట్లు క‌నిపించింది దీపికా ప‌దుకొనే. కానీ త‌ర్వాత అద్భుత‌మైన పాత్ర‌ల‌తో త‌న న‌ట కౌశ‌లాన్ని ప్ర‌ద‌ర్శించింది. గ‌త ఏడాది వ‌చ్చిన ప‌ద్మావ‌త్ చిత్రంతో న‌టిగా ఆమె ఎన్నో మెట్లు ఎక్కేసింది. ఇప్పుడు ‘ఛపాక్‌’ సినిమాతో దీపికా మ‌రింత పేరు సంపాదించేలాగే క‌నిపిస్తోంది. 2005లో యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మి అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కిన ‘ఛపాక్‌’ చిత్రంలో దీపికే.. ల‌క్ష్మి పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమా ట్రైల‌ర్ చూసిన వాళ్లంద‌రి హృద‌యాలు బ‌రువెక్కుతున్నాయి. ల‌క్ష్మి పాత్ర‌లో దీపిక అద్భుతంగా న‌టించి శ‌భాష్ అనిపించుకుంది. దీపిక లాంటి గ్లామ‌ర్ హీరోయిన్ ఇలాంటి పాత్ర చేయ‌డం అంటే సాహ‌స‌మే. 

ఈ సినిమా విష‌యంలో దీపిక చాలా ఉద్వేగంతోనే ఉన్న‌ట్లుంది. తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన చిత్రమ‌ని పేర్కొన్న ఆమె.. ముంబ‌యిలో ట్రైల‌ర్ లాంచ్ చేసిన సంద‌ర్భంగా ఎమోష‌న‌ల్ అయిపోయింది. సినిమా విశేషాల గురించి చెబుతూ.. ల‌క్ష్మి గురించి చెప్తున్న క్రమంలో దీపిక కన్నీళ్లు పెట్టుకుంది. ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తుండ‌గా.. దీపిక స్వ‌రం బొంగురుపోయింది. మాట‌లు రాలేదు. దీంతో అక్కడే ఉన్న దర్శకురాలు మేఘనా గుల్జార్‌ ఆమెను ఓదార్చింది.  ఈ చిత్రంలో దీపిక‌కు జోడీగా.. ల‌క్ష్మి భర్త అమల్‌ దీక్షిత్‌ పాత్రలో విక్రాంత్‌ మాస్సే న‌టించాడు. ఫాక్స్ స్టార్ సంస్థ నిర్మించిన ఛ‌పాక్ జనవరి 10న విడుదల కానుంది.