ఢిల్లీ భయం... కనిపిస్తే అరెస్టే !

June 03, 2020

ఇప్పటివరకు కరోనా ఏపీని భయపెట్టలేదు. కానీ ఇపుడు వణికిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన మర్కజ్ సభలో పాల్గొన్న వారు ఏపీ అంతా విస్తరించి ఉన్నారు. ఏపీ నుంచి ఈ సభకు 180 వెళ్లొచ్చారట. వారిలో గవర్నమెంటుకు 140 మందే దొరికారు. వారిలో ఇప్పటివరకు 103 మంది టెస్టు రిజల్టు వచ్చాయి. ఐదురురికి కరోనా పాజటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 

మిగతా 40 మంది ప్రభుత్వం ప్రకటన చేసినా ముందుకు రాలేదు. వాళ్లు ఎక్కడున్నదీ తెలియడం లేదు. దీంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఢిల్లీ సభకు వెళ్లొచ్చిన వారు బయట ఎక్కడ దొరికినా అరెస్టు చేస్తామని చెప్పారు. తమంతట తాము వచ్చి పరీక్షలు చేసుకుంటే చికిత్స అందజేసి వ్యాధి నయం చేసే అవకాశం ఉంటుందని... అలా కాకుండా బయట తిరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఢిల్లీ కేసులతో ఒక్కసారి ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గుంటూరు కలెక్టర్ శామ్యూల్ మాట్లాడుతూ అందరూ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నారని... మిగతా వారు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిని కలిసిన వారు కూడా వచ్చి ప్రభుత్వాన్ని సంప్రదించాలని కలెక్టర్ కోరారు.