ఢిల్లీ వీధుల్లో అమ్మాయిల సంత

June 02, 2020

మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. వ్యభిచారం అనేది ఈ భూమ్మీద వందల సంవత్సరాల నుంచే ఉంది. రాజుల కాలం నుంచి నేటి వరకు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా... వ్యభిచారం వల్ల నరకం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్పినా జనానికి భయం రాలేదు. చేయించేవాళ్లకి అస్సలు భయంలేదు. ట్రాఫికంగ్ వల్ల కొందరు, తప్పక కొందరు, డబ్బుల కోసం కొందరు, అవకాశాల కోసం కొందరు... ఇలా అనేక కారణాలతో ఎంతో మంది అమ్మాయిలు అందులో బందీ అయి ఉన్నారు.

ఎన్ని చర్యలు తీసుకున్నా అది నానాటికీ విస్తరిస్తూ కొత్త పుంతలు తొక్కుతుందే గానీ తగ్గలేదు. తమాషా ఏంటంటే... ప్రపంచంలో సగం దేశాల్లో వ్యభిచారం నిషేధం కాదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. మనదేశంలో కూడా వ్యభిచారం నిషేధం కాదు. కాకపోతు ఒక స్త్రీ స్వతంత్రంగా డబ్బుల కోసం ఎవరిని అయినా ఆశ్రయిస్తే నేరం కాదు. అయితే... ఆమె చేత ఎవరైనా దీనిని వ్యాపారంగా చేయిస్తే నేరం. అందుకే వ్యభిచారంలో అరెస్టు అయిన అమ్మాయిలను రిహాబిలిటేషన్ కి పంపుతారు గాని జైలుకు పంపరు. నిర్వహకులను, విటులను మాత్రమే జైలుకు పంపుతారు. నిర్వహకులకు పెద్ద శిక్షలు వేస్తారు. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ మసాజ్ పార్లర్లు ఏనాడో వ్యభిచార కేంద్రాలుగా మారిపోయాయి. ఏ పార్లర్ కి వెళ్లినా అనేక రకాల అమ్మాయిలను అందుబాటులో ఉంచుతున్నారట. తాజాగా ఓ మసాజ్ పార్లర్ నుంచి పెద్ద సంఖ్యలో అమ్మాయిలను విమెన్ కమిషన్ ఛీఫ్ స్వాతి కాపాడింది. చిత్రమైన విషయం ఏంటంటే... ఈరోజు ఆమె దాడులు నిర్వహించిన పార్లర్ పై గతంలోనూ దాడులు జరిగి కొందరిని రక్షించారు. మరి అప్పుడు దాడుల్లోపట్టుబడిన ఆ పార్లర్ ఇప్పటికీ ఎవరు నడిపిస్తున్నారు? దాని వెనుక ఎవరు ఉన్నారు?  ఆ పార్లర్ లో అరాచకాలు మామూలుగా లేవు. అమ్మాయిల ఫొటోలు, రేట్లతో సహా ముద్రించిన రేట్ కార్డులు ఉంటాయి. వాటిలో నచ్చిన వారిని ఎన్నకుని తాత్కాలికంగా గంటల లెక్కన కొనుక్కోవచ్చట. ఇంత ఆర్గనైజ్డ్ గా ఈ వ్యాపారం నడిపిస్తున్నారు. ఈరోజు దేశ రాజధానిలో ఇది సంచలనం అయ్యింది.