సారాకంపెనీల బకాయిలు తీర్చడానికి ప్రపంచ బ్యాంకుని ఋణం ఇవ్వమని డిమాండ్ చేస్తాం....ఆంప్ర ఉపముఖ్యమంత్రి

June 03, 2020

ప్రపంచ బ్యాంకుని ఇలా ఋణం ఆడిగినవాళ్ళు ఇంతవరకూ ప్రపంచ బ్యాంకు చరిత్రలోనే మరొకరులేరు, ఇటువంటి వ్యక్తిని కేబినెట్లో పెట్టుకున్న నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలాంటి వ్యక్తి మేధావులు జ్ఞానులు ప్రపంచంలో ఇంతవరకూ ఎవరూలేరు, ఉండబోరు.
కాబట్టి, ఈ ఉపముఖ్యమంత్రికి ఒక వీరతాడు, ఇటువంటి వ్యక్తిని కేబినెట్లో ఉపముఖ్యమంత్రిగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రెండు వీరతాళ్ళు వేయాల్సిందే.

అలాగే, నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత ఆత్మీయులైన కేంద్రప్రభుత్వం/బీజేపీ ప్రభుత్వం ఇలాంటి గొప్పఆలోచన చేసిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రికి భారతరత్న లేదా జ్ఞానపీఠ లేదా పద్మవిభూషణ లేదా కనీసం పద్మభూషణ్ ఆవార్డు ఇఛ్చి గౌరవించాల్సిందే. అలాగే, ఇలాంటి గొప్పవ్యక్తులను కేబినెట్లో పెట్టుకుని ఆదర్సవంతమైన పాలన సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి నోబెల్ బహుమతి కోసం బీజేపీ ప్రభుత్వం నామినేట్ చేయాల్సిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా పోలవరం అమరావతి లాంటి సింగినాదం జీలకర్ర ఏమీవద్దు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి నోబెల్ బహుమతి ఇవ్వండిచాలు.
లేదా....ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి భారతరత్న ఇఛ్చి, ఉపముఖ్యమంత్రికి పద్మభూషణ్ ఇవ్వండిచాలు.

పనిలోపనిగా, ఆంధ్రప్రదేశ్ జాతిరత్నాలులాంటి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సభ్యులకు అందరికీ పద్మవిభూషణ లేదా పద్మభూషణ్ అవార్డు, మిగిలిన అధికారపార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు పద్మభూషణ్ లేదా పద్మశ్రీ అవార్డు ఇవ్వండి సార్...!

హలొ...మోడీ గారూ! హలొ అమిత షా గారూ ! ...వినిపిస్తోందా ?

వినకపోతే మీఇష్టం...మీకే కష్టం.!