ఆయనకు 2 లక్షల ఎకరాలు భూమి ఉంది... కానీ అనాథ

July 12, 2020

ఆయ‌న‌కున్న సంప‌ద లెక్కను ఒక్క మాట‌లో చెప్పేయొచ్చు. ఆయ‌న‌కున్న ఆస్తిపాస్తుల మొత్తాన్ని ప‌క్క‌న పెడితే ఆయ‌న‌కున్న భూమి ఎంతో తెలుసా? అక్ష‌రాల 2.21ల‌క్ష‌ల ఎక‌రాలు. అది కూడా గ్రేట్ బ్రిట‌న్ లో. అంత సూప‌ర్ రిచ్ అయిన పెద్దాయ‌న ఎవ‌రంటారా? అంత‌ర్జాతీయ వ‌స్త్ర దుకాణాల సంస్థ బెస్ట్ సెల్ల‌ర్.. అసోస్ లో ఏకైక అతి పెద్ద షేర్ హోల్డ‌ర్.. 11 స్కాటిష్ ఎస్టేట్లు.. ఒక క్యాజిల్ లాంటి ఎన్నో వ్యాపారాలున్నా బిలీయ‌నీర్ పోల్సెస్.
అన్ని ఉన్నా.. విధి వ‌క్రీకరించింది. త‌న‌కున్న సంప‌ద‌తో కొండ మీద ఉన్న కోతిని కిందికి ర‌ప్పించ‌గ‌ల స‌త్తా ఉన్న ఆయ‌న తాజాగా కోలంబోలో చోటు చేసుకున్న ఉగ్ర‌దాడుల్లో త‌న ముగ్గురు సంతాన్ని ఆయ‌న కోల్పోయారు. దీంతో.. ఆయ‌న ఇంట్లో ఇప్పుడు తీవ్ర విషాదం నెల‌కొంది. ఈస్ట‌ర్ సండే రోజున శ్రీ‌లంక‌లో చోటు చేసుకున్న ఉగ్ర‌దాడిలో తన పిల్ల‌ల్లో ముగ్గురిని కోల్పోయారు పోల్సెస్.
ఈస్ట‌ర్ సంద‌ర్భంగా శ్రీ‌లంక ట్రిప్ కు వ‌చ్చిన ఆ కుటుంబానికి తీర‌ని విషాదం వెంటాడింది. బాంబుపేలుళ్ల‌లో ముగ్గురుపిల్ల‌ల్ని కోల్పోయిన వైనాన్ని బెస్ట్ సెల్ల‌ర్ సంస్థ ప్ర‌తినిధి అధికారికంగా పేర్కొన్నారు. మొత్తం న‌లుగురు పిల్ల‌ల్లో ముగ్గురు చ‌నిపోగా.. మ‌ర‌ణించిన వారి వివ‌రాల్ని కుటుంబ గోప‌త్య‌లో భాగంగా వెల్ల‌డించ‌లేదు. అంతేకాదు.. ఎక్కువ వివ‌రాల్ని బ‌య‌ట‌పెట్ట‌కుండా.. ఉగ్ర‌దాడితో పోల్సెస్ కుటుంబంలో చోటుచేసుకున్న విషాదాన్ని పేర్కొన్నారు.
బ్రిట‌న్ లో అతి పెద్ద ల్యాండ్ ఓన‌ర్ గా పోల్సెస్ ప్ర‌ముఖుడు. తాజా విషాదం ఆయ‌న కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ త‌గిలేలా చేసింద‌న్న మాట వినిపిస్తోంది.