కోడెలపై జాలి పడిన వైసీపీ టాప్ లీడర్

August 07, 2020

అదేంటి, అవకాశం దొరికితే చాలు.. కోడెల శివప్రసాద్ ను తీవ్రంగా విమర్శించడానికి సిద్ధంగా ఉండే వైసీపీ నేతలు ఆయనపై జాలిపడటం జరిగిపనేనా అనుకుంటున్నారు కదా. అవును నిజంగానే వైసీపీకి చెందిన ఒక టాప్ లీడర్ కోడెల పరిస్థితిని గుర్తుచేస్తూ జాలిపడ్డారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఈరోజు తిరుమల ఆలయానికి వచ్చారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోడెల పరిస్థితి చూస్తే బాధగా ఉందన్నారు. అయితే, ఇది ఆయన స్వయంకృతాపరాధమని వ్యాఖ్యానించారు. 

జనం సాక్ష్యాలతో సహా కోడెలపై పెద్ద సంఖ్యలో విమర్శిస్తున్నారు అంటే... కోడెల కుటుంబం తప్పు చేయకుండా అది సాధ్యం కాదు కదా. చివరకు టీడీపీ నేతలే కోడెల మాకు వద్దు. అతనుంటే మేము ఉండం అంటున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. కోడెల తన అధికారాన్ని దుర్వినియోగం చేసుుని ఈ దుస్థితి తెచ్చుకున్నారు. ఏది ఏమైనా ఒక సీనియర్ నేత పట్ల ఈ స్థాయిలో విమర్శలు రావడం ఆశ్చర్యకరమైన విషయం. చాలా బాధాకరం అన్నారు కోన రఘుపతి.