‘దేవ్’ మూవీ రివ్యూ

May 31, 2020

సినిమా: దేవ్

నిర్మాణ సంస్థ‌లు: లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్‌, ప్రిన్స్ పిక్చ‌ర్స్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

స‌మ‌ర్ప‌ణ‌: బి.మ‌ధు

నటీనటులు: కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌కాశ్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, నిక్కి గ‌ల్రాని, కార్తీక్ ముత్తురామ‌న్ త‌దిత‌రులు

సంగీతం: హేరీష్ జైరాజ్‌

ఛాయాగ్ర‌హ‌ణం: ఆర్‌.వేల్‌రాజ్‌

కూర్పు: రూబెన్‌

నిర్మాత‌లు: ఠాగూర్ మ‌ధు, ఎస్‌.ల‌క్ష్మ‌ణ్ కుమార్‌

ద‌ర్శ‌క‌త్వం: ర‌జ‌త్ ర‌విశంక‌ర్‌

 

తమిళ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ తెలుగులో కూడా బాగా రాణిస్తున్నాడు. తెలుగులో ఈయన నటించిన సినిమాలన్నీ బాగా సక్సెస్ కావటంతో ఈయనకు మంచి మార్కెట్ ఏర్పడింది. తాజాగా ఈయన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `దేవ్‌` తో మరోసారి ప్రేక్షకులముందుకొచ్చాడు.

 

కథ:

 

కార్తి పేరు ఈ సినిమాలో దేవ్. ఆయన మ‌న‌సుకు న‌చ్చినట్లు ఉంటూ ఫ్రీలాన్స్ ఫోటో జ‌ర్న‌లిజం చేస్తూ త‌న‌కు న‌చ్చిన ప్రదేశాలు తిరుగుతూ ఉంటాడు. ఎవరెస్టు ఎక్కాలని లక్ష్యం గా పెట్టుకుంటాడు. ఇక పేస్ బుక్ లో మేఘన ( రకుల్) ను చూసి ఇష్టపడతాడు. అయితే ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. మొదట నో చెప్పిన మేఘన ఆ తర్వాత దేవ్ ని లవ్ చేస్తుంది. ఓ కార‌ణంగా మేఘ‌న‌తో దేవ్ మాట్లాడ‌లేక‌పోతాడు. దాంతో మేఘ‌న త‌న‌ను దేవ్ నిర్ల‌క్ష్యం చేస్తున్నాడ‌నుకుని అత‌నితో గొడ‌వ‌ప‌డి వెళ్లిపోతుంది. దేవ్ ఎంత న‌చ్చ‌చెప్పినా మేఘ‌న వినిపించుకోదు.దేవ్‌కు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఆతరువాత వారిద్దరూ మళ్ళీ కలిశారా ? దేవ్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

సినిమా ఎలా ఉందంటే:

 

సినిమా కి మేజర్ ప్లస్ హీరో కార్తినే. వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటూ ఆ పాత్ర‌లకు త‌గ్గ‌ట్టు న్యాయం చేస్తున్న కార్తీ ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. లుక్ ప‌రంగా కొత్త‌గా క‌న‌ప‌డే ప్ర‌య‌త్నం చేశాడు. రోడ్ జ‌ర్నీని ఎంజాయ్ చేసే యువ‌కుడిగా.. ప్రేయ‌సి కోసం తాప‌త్ర‌య ప‌డే వ్య‌క్తిగా త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. విజువల్స్ , సినిమాటోగ్రఫీ , నేపథ్య సంగీతం. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎవరెస్టు ఎపిసోడ్ విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమాలో వచ్చే కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. కాకపోతే ఇది రొటీన్ స్టోరీ అనిపించింది. ఎక్కడ ఆసక్తికర మలుపులు లేకుండా ఊహించినవిధంగా సాగిపోతుండటం జరిగింది.

 

నటీనటులు, టెక్నీషియన్స్ పనితీరు:

 

కార్తి ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించాడు. రకుల్ తన పాత్రకు తగిన న్యాయం చేసింది. సీనియర్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ లు వారి పాత్రలకు తగ్గట్లుగా నటించారు. ఇతర నటీనటుల యాక్షన్ ఫర్వాలేదనిపించింది. విజువల్స్ , సినిమాటోగ్రఫీ , నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచాయి. హరీష్ జైరాజ్ సంగీతం త‌న పాత ట్యూన్స్‌నే వింటున్న‌ట్టుగా అనిపించింది. ఎమోష‌న‌ల్ సీన్స్‌కు హార‌ర్ మూవీ స్టైల్ ఆఫ్ నేప‌థ్య సంగీతం అందించాడు. వెట్రి కెమెరా వ‌ర్క్ బావుంది.

 

 బలాలు:

+ కార్తి నటన

+ నటీనటుల పనితీరు

+  కథ

 

బలహీనతలు:

- రొటీన్ స్టోరీ

-  స్లో నేరేషన్

 

మొత్తంగా: ‘దేవ్ ’ఫర్వాలేదనిపింది

 

రేటింగ్: 2.5/5

RELATED ARTICLES

  • No related artciles found