దేవినేని ఉమ అరెస్టు

April 06, 2020

ఈరోజు కేబినెట్ మీటింగులో అమరావతిపై కీలక నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో నిరసనలు పెరిగాయి. కృష్ణా గుంటూరు జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు ఉదృతంగా సాగుతున్నాయి. గొల్లపూడి ప్రాంతంలో ధర్నాచేస్తున్న దేవినేని ఉమ వద్దకు పోలీసులు వచ్చి ధర్నాకు అనుమతి లేదని చెప్పారు. మీరు ప్రజల అనుమతితో రాజధాని మారుస్తున్నారా?  రాష్ట్రానికే అన్యాయం జరుగుతుంటే మీ అనుమతి కోసం చూడాలా అంటూ ఉమ వారిపై కోప్పడ్డారు. అయితే... ధర్నా, రాస్తారోకోలు చేయడానికి వీల్లేదని పోలీసులు ఉమని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.

ఉమ తరలింపును జనాలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, ప్రజలకు తోపులాట జరిగింది. దీంతో పోలీసులు దేవినేని ఉమను అరెస్టు చేశారు. భారీ ఎత్తున మహిళలు, స్థానికులు కూడా ధర్నాల్లో పాల్గొన్నారు. వారంతా పోలీసు వాహనాలు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులతో స్థానికులు వాదించారు. ఉమను ఇక్కడే వదిలేయాలని నినాదాలు చేశారు. అమరావతే మా రాజధాని అంటూ నినదించారు. పరిస్థితి చేయిదాటి పోతుండటంతో పోలీసులు దేవినేని ఉమను బలవంతంగా తరలించేశారు.