పెళ్లి ఫొటోలు: దిల్ రాజు భార్య పేరేంటి?

August 03, 2020

దిల్ రాజు పెళ్లి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎప్పటి నుంచో దిల్ రాజుకు రెండో పెళ్లి జరుగుతుందని సినీ జనాలు గాసిప్ లు మాట్లాడుకున్నారు. ఎవరైనా హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడని కొందరు ప్రచారం చేశారు. 

దిల్ రాజు మాత్రం తన కుటుంబ సభ్యులకు పరిచయం అయిన ఒక అమ్మాయిని పెళ్లాడాడు. 33 సంవత్సరాల ఈ మహిళ పేరు తేజస్విని అంటున్నారు. అయితే... ఆస్ట్రాలజీ ప్రకారం పెళ్లి సందర్భంగా పేరు మార్చినట్టు తెలుస్తోంది. ఆమె పేరును ’వైఘా రెడ్డి‘ గా మార్చారని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా... ఈ పెళ్లికి చాలా తక్కువ మంది హాజరు కాగా... కేవలం ఇద్దరు తెలుగు దర్శకులు హాజరైనట్లు చెబుతున్నారు. ఒకరు హరీష్ శంకర్, మరొకరు అనిల్ రావిపూడి. వీరిద్దరు మాత్రమే దిల్ రాజు పెళ్లికి సినీ అతిథులు. మిగతా అందరూ కుటుంబ సన్నిహితులే.