దిల్ రాజు పెళ్లి... ఈ సస్పెన్స్ ఏంటో

August 06, 2020

ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దిల్ రాజు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇది ఈ రోజు వైరల్ వార్త. వధువు ఎవరు అనేది ఇంకా తెలియడం లేదు. ఆయన కూడా వెల్లడించడానికి ఆసక్తి చూపలేదు. ఈ పెళ్లి నిజామాబాద్ లోని వెంకటేశ్వరాస్వామి ఆలయంలో జరగనుంది.

దిల్ రాజు వెంకటేశ్వరస్వామిని ఆరాధిస్తారు. అందుకే ఆయన బ్యానర్ పేరు కూడా స్వామి వారి పేరు మీదే పెట్టారు. తాజాగా తన పెళ్లి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే చేసుకుంటున్నారు.

వందేళ్ల తర్వాత మనిషికి మళ్లీ అంతటి కష్టం వచ్చింది. ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద కష్టం ఇది. దీని కారణంగా తన వృత్తి జీవితం నిలిచిపోయింది అని దిల్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. తన పెళ్లి గురించి ఎటువంటి వివరాలు వెల్లడించకుండా అతను ఇలా రాశాడు, "నా జీవితంలో కొత్త ఆశతో, నా వ్యక్తిగత జీవితాన్ని సంతోషంగా తిరిగి ప్రారంభించడానికి ఇది మించిన సమయం లేదు అనుకుంటున్నాను" దిల్ రాజు అన్నారు.

ఆయన పెళ్లి కేవలం 30-40 మంది కుటుంబ బంధువులు, సన్నిహితుల మధ్యనే జరగనుంది. సినిమా పెద్దలు కూడా ఎవరూ పెద్ద సంఖ్యలో హాజరు కావడం లేదు. రెండో పెళ్లి కావడం ఒక కారణం అయితే, ఇపుడు నిబంధనలు కూడా ఒప్పుకోవడం లేదు. నిజానికి దిల్ రాజుకు కావల్సింది కూడా ఇదే.

అయితే ప్రతి ఒక్కరిలో దిల్ రాజు సస్పెన్స్ రేకెత్తించారు. దిల్ రాజుకు కాబోయే భార్య ఎవరు? దిల్ రాజు ఎవర్ని పెళ్లి చేసుకుంటున్నాడు. సినిమా వ్యక్తినే పెళ్లి చేసుకుంటున్నాడా? ఎవరయినా హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్నాడా? అనే ఉత్కంఠ అందరిలో ఉంది.