దిల్ రాజు భార్య ఎవరో తెలిసింది, మరి పెళ్లి పెద్ద ఎవరో తెలుసా?

August 03, 2020

దిల్ రాజుకు పెళ్లి జరిగింది. భార్య చనిపోయాక మూడేళ్లుగా ఒంటరిగా ఉంటున్న దిల్ రాజు తాజాగా పెళ్లాడారు. ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన ఒక అమ్మాయిని దిల్ రాజు పెళ్లి చేసుకున్నారు. వీరిది కులాంతర వివాహం. ఆమె బ్రాహ్మణ యువతి. 

దిల్ రాజు వయసు 49 ఏళ్లు. దేవుడు ఆరోగ్యం కాపాడితే ఆయనకు ఇంకా 20-30 ఏళ్ల జీవితం ఉంది. అంతకాలం ఒక మనిషి ఒంటరిగా ఉండటం చాలా కష్టమైన విషయం. తండ్రి కష్టాన్ని గుర్తించిన దిల్ రాజు కూతుర హన్షిత రెడ్డి దగ్గరుండి నాన్నకు పెళ్లి చేసింది.

2014లో దిల్ రాజు కూతురు పెళ్లయ్యింది. 2017లో దిల్ రాజు భార్య అనిత చనిపోయారు. 2020లో కూతురు మాతృదినోత్సవం రాజు నాన్నకు పెళ్లి చేసి కొత్త ‘అమ్మ‘ను వెతుక్కుంది. 

శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆరాధించే దిల్ రాజు చాలా నిరాడంబరంగా నిజామాబాద్ జిల్లాలోని తన ఊరు నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లాడారు. నిన్నటి నుంచి దిల్ రాజు భార్య ఎవరా అన్న నెటిజన్ల ఉత్కంఠకు చివరకు తెరపడింది. 

Image