నిజమెంత? క్రిష్ తో పవన్ మూవీ టైటిల్ లీక్?

August 13, 2020

ఒక సినిమా తర్వాత మరొకటన్న వ్యక్తిగత రూల్ ను టాలీవుడ్ లోని పలువురు అగ్ర హీరోలకు బాగా ఎక్కించిన హీరో ఎవరంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు వినిపించేది. ఆయన సినిమాలకు మస్తు డిమాండ్ ఉన్నా.. కొంతకాలం పాటు సినిమాలేమీ చేయకపోవటం.. ఒకవేళ చేసినా.. సదరు సినిమా ఎప్పుడూ విడుదల అవుతుందో చెప్పే పరిస్థితి ఉండేది కాదు.
తెలుగు ప్రజల్లో మస్తు క్రేజ్ ఉన్నప్పటికీ ఆచితూచి అన్నట్లుగా సినిమాలు చేసే పవన్.. జనసేన తర్వాత ఒకట్రెండు సినిమాలు చేసి.. ఇక సినిమాలు చేయనని తేల్చేశారు. అయితే.. తాజాగా మనసు మార్చుకొని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు చేయటం తెలిసిందే. హిందీ పింక్ మూవీకి రీమేక్ ను చేస్తున్న ఆయన.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటమే కాదు.. యుద్ధ ప్రాతిపదికన సినిమాలు చేస్తున్నారు.
మరో రెండు వారాల్లో పింక్ మూవీ షూట్ అయిపోయిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో తీయనున్న పిరియాడికల్ మూవీకి రెఢీ అవుతున్నారు. ఈ సినిమాలో పాత్ర కోసం పవన్ విపరీతంగా కష్టపడుతున్నట్లు చెబుతున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ ఒక్క చారిత్రాత్మక సినిమాను చేయని పవన్ తాజాగా చేస్తున్న ఈ చిత్రంలో బందిపోటుగా చేస్తున్నట్లు చెబుతున్నారు.
రాబిన్ హుడ్ మాదిరి ఈ సినిమాలో పవన్ ఉంటారని చెబుతున్నారు.ఈ సినిమా కోసం చార్మినార్.. తాజ్ మహాల్ ను ప్రత్యేకంగా సెట్లు వేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకు పవర్ ఫుల్ పేరును అనుకుంటున్నట్లుగా లీకులు వస్తున్నాయి.  ఈసినిమాలో పవన్ పేరు వీర అని.. దానికి తగ్గట్లు విరూపాక్షి అన్నపేరును అనుకుంటున్నట్లు చెబుతున్నారు. రోటీన్ కు భిన్నంగా ఉండేలా ఈ టైటిల్ అయితే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది. 2021లో విడుదలయ్యే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. బయటకు వచ్చిన విరూపాక్షి టైటిల్ లో నిజమెంత? అన్నది తేలాల్సి ఉంది.