రవితేజ... మళ్లీ ఫన్ గేమ్ మొదలెడతాడా?

February 23, 2020

మాస్ మహారాజా రవితేజ మళ్లీ వచ్చాడు. అతడి నుంచి అందరూ కోరుకునే జానర్ తో ఈసారి ముందుకు వస్తున్నాడు. సంక్రాంతి నుంచి ముందుకు అంటే డిసెంబరు సెలవుల్లో అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈరోజు ఫస్ట్ లుక్ వచ్చింది.

ఎస్ఆర్‌టీ మూవీస్ బ్యానర్‌పై వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తల్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ వైరల్ అయ్యింది. చేతిలో సిగరెట్ పెట్టుకుని సోఫాలో దర్జాగా నవ్వుతూ కూర్చున్న డిస్కోరాజా...  తన గతం చిత్రాలు కిక్ సినిమా వంటి ఫన్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనుకాడని.. నభా నటేష్ (ఇస్మార్ట్ శంకర్ ఫేం), పాయల్ రాజ్ పుత్ (ఆర్ఎక్స్ 100 ఫేం) ఇందులో హీరోయిన్లు. డిసెంబరు 20 నుంచి డిస్కో వాయిస్తాడట.