జేసీ దివాకర్ రెడ్డికి జగన్ తాజా షాక్

August 06, 2020

జగన్ మొండివాడు, అతను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అంటాడు. ఎవరి మాటా వినడు. ఆయన వినేది ఒకరి మాట మాత్రమే. ఆయనే మోడీ. అది కూడా కేసుల భయంతోనే మోడీ మాట వింటాడు అని ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విన్నాం. దానికి రిటర్న్ గిఫ్ట్ జేసీకి చేరింది.

తాజాగా దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 4 భారీ టిప్పర్లను అధికారులు సీజ్ చేశారు. వీటిని నాగాలాండ్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసినట్టు అధికారులు గుర్తించారు. వీటికి నేషనల్ పర్మిట్ ఉన్నా కూడా BS III వాహనాలను BS IV వాహనాలుగా చూపించి తిప్పుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ కారణంతోనే వాటిని సీజ్ చేశారు.

ఇదిలా ఉండగా... గతంలో కూడా జేసీ దివాకర్ రెడ్డి వాహనాలను ఏపీ ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. వీటితో కలిపి 61 వాహనాలను జేసీ కుటుంబానివి సీజ్ చేశారు.

ఇంకా ఇలాంటి వాహనాలు 154 ఉన్నట్లు గుర్తించామని, వాటిని కూడా సీజ్ చేస్తామని ఆర్టీఏ అధికారులు తెలిపారు.