మన దొర గారిని ఛీ పో అన్నాడటగా తమిళ తంబి?

July 11, 2020

ఒక విషయంలో ఒక లాజిక్ పనిచేసినపుడు 

ఇంకో వియంలో ఇంకో లాజిక్ పనిచేస్తుంది కదా

ఈ చిన్న తేడా అర్థం చేసుకోకపోతే ఎలా దొరగారు. ఒక ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి వెళ్లినా సాధారణ సంప్రదాయం ప్రకారం అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా పొమ్మనరు. అది సాటి ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం. ఈ లాజిక్ తోనే బెంగాల్, ఒడిసా, కర్ణాటక ముఖ్యమంత్రులను కలిశాడు కేటీఆర్. ఆ మూడు కలయికల ఉద్దేశం వాళ్లు బాబుతో లేరు అని ప్రచారం చేయడానికి వాడిన ఓ చీప్ ట్రిక్. కాకపోతే పాపం దొర కేసీఆర్ ఆయా ముఖ్యమంత్రులను కలిసి వచ్చాక ఆయా రాష్ట్రాల్లో ఏవో ప్రత్యేక సందర్భాలు ఏర్పడ్డాయి. అప్పుడు దొరగారు మూసుక్కుచ్చున్నారు. కానీ చంద్రబాబు వారికి అండగా నిలిచారు. ఆ తర్వాత వారు చంద్రబాబుకు అండగా నిలిచారు. చివరకు అన్ని అవమానాల తర్వాత కేసీఆర్ దొర చాలా రోజులు సైలెంట్. మళ్లీ అదే లాజిక్ తో కేరళ సీఎంను కలిశారు. పాపం వరద అప్పుడు 25 కోట్లు ఇచ్చాడుగా చక్కగా మర్యాద ఇచ్చి మాట్లాడాడు కేరళ సీఎం. కానీ ఆ తర్వాత స్టాలిన్ ను కలుద్దాం అని ఫోన్ చేస్తే... పో పో పోవయ్యా అన్నట్టు కేసీఆర్  కలయికను స్టాలిన్ నిరాకరించాడట.

ఒక్క మాట కూడా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి మాట్లాడకున్నా సొంత మీడియాలో, సోషల్ మీడియాలో హోరెత్తించి ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఫిడేలు వాయిస్తున్న కేసీఆర్ బ్యాచ్ కి స్టాలిన్ కరెంట్ షాక్ ఇచ్చాడు. ఎందుకంటే అతను ప్రతిపక్ష నేత. కాబట్టి సీఎం అయినా ఎవరయినా వద్దనడానికి ఏ ప్రొటోకాల్ అడ్డురాదు. కేసీఆర్‌తో భేటీకి నో చెబితే చెప్పారు... ఆఖ‌రికి ఈ విష‌యంలో అధికారిక స‌మాచారం సైతం ఇవ్వ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశం. 

22 పార్టీలను ఏకం చేసిన చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పగలడా? ఏ రోజూ జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టని కేసీఆర్ శాసించగలడా? అయినా మోడీకి లోపాయకారీ మద్దతు ఇస్తున్న కేసీఆర్ మోసాలు అమాయక తెలంగాణ వాళ్లు పసిగట్టలేదేమో గాని తమిళ తంబి పసిగట్టాడు.

అయినా మిత్రుడు (బాబుకి) శత్రువు వస్తే కనీస స్నేహధర్మం పాటించి ఛీకొట్టి పంపాడని చెబుతున్నారు జనం.