మోడీకి స్టాలిన్ వార్నింగ్... సూపర్

May 26, 2020

ఎదుటి వాడు బలవంతుడయినా మన వద్ద న్యాయం ఉన్నపుడు మన వాయిస్ గట్టిగా వినిపించాల్సిందే. మన భయమే మనల్ని వెనక్కులాగుతుంది. మన ధైర్యమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. తాను ఉత్తరాదికి మాత్రమే ప్రధాని మంత్రి అనేలా ఫీలయ్యే మోడీకి ఈరోజు స్టాలిన్ చురకలు అంటించారు.

కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలనే మోదీ గుర్తించేవారని, ఆ రోజులు పోయాయని, ఆ రాష్ట్రాలతో మాత్రమే దేశం నిర్మితం కాలేదని, ఈ స్థాయికి రావడానికి దక్షిణాది ఎంతో ప్రముఖ పాత్ర పోషించిందని.. ఇదంతా గుర్తుంచుకోవాలని నరేంద్ర మోదీకి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సూటిగా చెప్పారు. ఇప్పటివరకు జరిగింది ఓకే. ఇక నుంచి ఇది ఒక దేశం... దీనిని సమదృష్టితో పాలించండని చెప్పారు.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని మెజారిటీని సాధించిన నేపథ్యంలో కూడా స్టాలిన్ మోడీకి ఈ రేంజిలో హెచ్చరిక పంపడం ఆశ్చర్యమే. తమిళనాడులో 38 లోక్ సభ సీట్లకు గాను డీఎంకే 36 సీట్లు గెలుచుకోవడం తెలిసిందే. చిత్రమేంటంటే... ఎంత ప్రయత్నించినా బీజేపీ అక్కడ ఖాతా కూడా తెరవలేకపోయింది. అన్నాడీఎంకేని అడ్డంగా వాడుకుని ఆ ప్రజలకు కోపం తెప్పించింది.

స్టాలిన్ మాటల్లో చెప్పాలంటే... 

‘‘నిర్మాణాత్మక రాజకీయాలేమైనా పరిధులకు లోబడి మాత్రమే ఉండాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ ఒక్క రాష్ట్రాన్నీ విస్మరించడానికి వీల్లేదు. కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలనే మీరు గుర్తించే రోజులు పోయాయి. ఆ రాష్ట్రాలతోనే దేశం నిర్మితం కాలేదని మీరు గుర్తుంచుకోవాలి’’ 

ఇది మోడీకి ఆయనిచ్చిన వార్నింగ్ లాంటి సందేశం. మరి మోడీ రిప్లయి ఎలా ఉంటుందో చూడాలి.