రైళ్లు, విమానాలు: కేంద్రానికి తొందరెక్కవైందా?

August 11, 2020

కరోనాకు భయపడి ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకోవడం మంచిది కాదు. నిజమే. కానీ... తొందర కూడా మంచిది కాదు. అదేంటో మరి... ఒకవైపు దేశం కరోనా కేసుల్లో పీక్ స్టేజికి వెళ్తున్న కొద్దీ సడలింపులు పెంచుతోంది కేంద్రం. 

ఇప్పటికే స్పెషల్ ట్రైన్లు వేసింది. వాటిని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. గోవా ముఖ్యమంత్రి బీజేపీయే అయినా మా రాష్ట్రంలో రైళ్లను ఆపకుంటే సంతోషిస్తాం అన్నారు. తర్వాత ప్యాసింజర్లు రైళ్లు కూడా జూన్ 1 నుంచి నడపాలని నిన్న సంచలన వార్త చెప్పింది కేంద్రం. తొలుత 200 రైళ్లు నడుపుతాం అన్నది. రిజర్వేషన్లు చేసుకోమన్నది. సెకండ్ క్లాస్ రైళ్లు ఇవన్నీ.

తాజాగా విమానాలు తిప్పేస్తాం అని చెబుతోంది. అది కూడా ఎపుడో కాదు, రైళ్ల కంటే ముందే. ఈనెల 25వ తేదీ నుంచే విమానాలు తిప్పుతారట. ఓరిదేవుడా... ఒకవైపు రోజుకు 5 వేల కేసులు నమోదవుతుంటే ఏమిటీ తొందర అని జనం అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి కరోనా జనం కంటే ప్రభుత్వాలనే ఎక్కువ భయపెడుతోంది. ఎందుకంటే రోగం వస్తే ప్రభుత్వం వైద్యం చేయలేని స్థితిలో ఉంటే అది ఆ దేశానికి అవమానం కేసులు బాగా పెరిగితే తగినన్ని ఆస్పత్రులు అందుబాటులో లేవు. అయినా కేంద్రం జంకటం లేదు.

బహుశా ప్రపంచ మంతటా విలయతాండవం చేసినా అరకోటి జనాభాకు కూడా రాలేదు. తొక్కలోది దీని అంతు ఏందో చూద్దాం... ఎంత మందికి వస్తుందో రానీ అని కేంద్రం తొడగొట్టిందేమో కరోనాకు అనిపిస్తుంది ఈ నిర్ణయాలు చూస్తుంటే...

ఇక హైదరాబాదులో ఇష్టారాజ్యంగా సడలింపులు ఇవ్వడంతో పాతబస్తీలో రంజాన్ షాపింగ్ తో వీధులు కిక్కిరిసాయి. భౌతిక దూరం జీరో. జనం విరగబడ్డారు. పైగా ఆ ఏరియాలో కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంత భారీ సడలింపులు ఇవ్వడం జనాల్ని భయపెడుతోంది. 

 Image