గ్రహణం టైంలో శృంగారం... 

August 11, 2020

కొన్ని నమ్మకాలు పాటించాలి. పాటించడం వల్ల నష్టం లేనపుడు పాటిస్తే మంచిదే కదా. మనిషి జీవితం నవ గ్రహాల కదలికలకు ప్రభావితం అవుతుంటుంది. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని కూడా ఒక గ్రహం కింద పరిగణిస్తారు.

సూర్యగ్రహణాలు ఏర్పడినపుడు గర్బిణులు బయటకు వస్తే పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. సైన్సు కూడా దీనిని ధృవీకరించింది. ఎందుకంటే అతినీలలోహిత కిరణాల వల్ల ఇలా జరగవచ్చని చెప్పింది.

అదే సూత్రం శృంగారానికి వర్తిస్తుంది. శృంగారం ఒక పునరుత్పత్తి ప్రక్రియ. ఈ ప్రక్రియ జరిగిన ప్రతిసారి అది పునరుత్పత్తికి దారితీయకపోవచ్చు. కానీ ఏ క్షణంలో అయినా... పునరుత్పత్తికి బీజం పడొచ్చు. అలాంటపుడు ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి అవసరం ఉంది.

గ్రహణం టైంలో ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా అని పొరపాటున భాగస్వామితో శృంగారంలో పాల్గొనడం మంచిది కాదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలా చేయడం ద్వారా అవయవలోపాలున్న పిల్లలు పుట్టే అవకాశం ఉంది.

పుట్టబోయే బిడ్డకు, గర్భం దాల్చే మహిళకు కూడా ప్రమాదం అని చెబుతారు. అందుకే గ్రహణం సమయంలో శృంగారం అవాయిడ్ చేయడం చాలా మంచిది. 

365 రోజులుండగా... ఆ ఒక్కరోజు ఆ 4 గంటలు పక్కనపెడితే కొంపలేం మునిగిపోవుగా... పెద్దల మాట చద్దిమూట.