ఢిల్లీ గొడవలు... ట్రంప్ కామెంట్ ఏంటి?

August 06, 2020

ఢిల్లీలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. బహుశా గత రెండు మూడు దశాబ్దాల్లో ఢిల్లీలో ఈ స్థాయిలో గొడవలు జరగడం ఇదే ప్రథమం కావచ్చు. ​పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఎన్సార్సీలు ఈ గొడవకు మూల కారణం. అమెరికా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా ఈ అల్లర్లు జరగడం అనేది అత్యంత సంచలనాత్మకం. ట్రంప్ టూర్ సమయంలో అది కూడా ట్రంప్ ఉన్న నగరంలో ఈ స్థాయిలో అల్లర్లు చెలరేగడటంతో ప్రపంచ మీడియా దృష్టి వీటిపై పడింది. ఇవి వ్యూహాత్మకంగా సృష్టించిన అల్లర్లు అని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇదిలా ఉండగా... ఢిల్లీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా డిప్లొమాటిక్ గా స్పందించారు. మీడియా ఈ అల్లర్ల గురించి ప్రస్తావించగా... CAA అంశంపై మోదీతో చర్చించలేదని వెల్లడించారు. భారత్‌లో మతపరమైన స్వేచ్ఛకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు మోడీ వ్యాఖ్యానించడం... మోడీ వ్యతిరేకులకు మరింత మంట పుట్టించింది. ఇక హింసాత్మక ఘటనలు భారత్ అంతర్గత విషయమని డోనాల్డ్ ట్రంప్ చెప్పడం ద్వారా అంతర్జాతీయ మీడియా దీనిపై రచ్చ చేయకుండా ట్రంపే అడ్డుకట్ట వేశారు. భారత్ గొడవల గురించి ఇతర దేశాల ఓ ఇదైపోవాల్సిన అసవరం లేదని, వాటిని తనంతట తాను భారత్ డీల్ చేయగలదన్న అర్థంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అనిపిస్తోంది. 

డొనాల్డ్ ట్రంప్... పర్యటన ఆసాంతం ఎక్కడా మోడీకి మైనస్ కాకుండా మాట్లాడారు. పైగా మోడీ క్రేజును మరింత పెంచేలాగా ట్రంప్ వ్యాఖ్యానాలు చేయడం విశేషం. మోడీ శూరుడు, వీరుడు, ధీరుడు అన్నట్లే ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. సీఏఏ గాని, ఇతర ఏ ఒప్పందాలు గాని ఎవరి వల్లనో మోడీ ప్రభావితం కాడని... ట్రంప్ నమ్ముతున్నారు. ఈ అభిప్రాయాన్నిబలపరిచేలా  ‘‘మోదీ మాటల్లోనే కాదు.. చేతల్లోనూ ధృడంగా ఉంటారు’’ అని ట్రంప్ మోడీ గురించి వ్యాఖ్యానించడం ఇక్కడ ప్రస్తావనార్హం.  మొత్తానికి మోడీ ట్రంప్ ను బాగా మౌల్డ్ చేసుకున్నట్టున్నారు. మోడీ కోరింది ట్రంప్ మాట్లాడి వెళ్లిపోయాడు. భారత ప్రధాని అభిప్రాయాలకు అనుగుణంగా పెద్దన్న వంటి అమెరికా అధ్యక్షుడు నడుచుకోవడం ఒక కొత్త పరిణామం అనే చెప్పాలి.​