అదే జరిగితే... ఏపీ కుప్పకూలుతుంది

May 26, 2020

ఎలాగైనా ఏదో ఒక విషయంలో చంద్రబాబు తప్పు అని నిరూపించడానికి కొత్త ప్రభుత్వం విపరీతంగా తాపత్రయపడుతోంది. వారికి దొరికిన తాజా పాయింట్... ప్రజలకు బాగా నెక్ట్ అవుతోంది గానీ టెక్నికల్ గా సాధ్యం కావడం లేదు. అదే విద్యుత్ కొనుగోళ్లపై రివర్స్ టెండరింగ్. సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి ధరలు టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల ఇపుడు కొంచెం తగ్గాయి. ఇది తెలిసే కంపెనీలు తొలుత కాస్త నష్టం భరించినా ఒక ఫ్లాట్ రేట్ కు కొనసాగుతాయి. ఒప్పందాలు ముగిశాక మళ్లీ కొత్త ఒప్పందాలు చేసుకున్నపుడు రేట్ రివైజ్ అవుతుంది. ప్రైవేటు కంపెనీలు చేసేదే వ్యాపారం. అలాంటపుడు లాభం లేకుండా చేయవు. పైగా ఈ ఒప్పందాలన్నీ కేంద్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయన్న పాయింట్ మరిచిపోయిన జగన్ సర్కారు దాని మీద మొండి పట్టుతో ఉంది.
ఇప్పటికే రెండు సార్లు కేంద్రం దీనిపై హెచ్చిరించిన జగన్ వెనక్కు తగ్గడం లేదు. దీనిపై ఈరోజు ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. పీపీఏలపై వాస్తవాల వక్రీకరణ జరిగిందని ప్రతిపక్షనేత చంద్రబాబు మండిపడ్డారు.

ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ రంగంలో రెగ్యులేటరీ కమీషన్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీయే అని చంద్రబాబు ఆయన గుర్తు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చినపుడు రాష్ట్రం విద్యుత్ లోటులో ఉందని, మా ప్రభుత్వ కృషి వల్ల సర్ ప్లస్ విద్యుత్ సాధించామని చంద్రబాబు నొక్కి చెప్పారు.
అలాగే భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు పెంచుకుండా చర్యలు కూడా తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఒక కీలక పాయింట్ ను బయటపెట్టారు. జగన్‌కు చెందిన సండూర్ పవర్ కంపెనీ కర్ణాటక సర్కారుకు విద్యుత్తు అమ్ముకుంటోందని, అక్కడ మాత్రం ఎక్కువ డబ్బులు కావాలని ఆ సర్కారును జగన్ కంపెనీ డిమాండ్ చేస్తోందన్నారు.
కర్ణాటక ప్రభుత్వం రాసిన లేఖను చంద్రబాబు సభలో చదివారు. మీరు చేస్తున్న తప్పులను కూడా నామీద నెట్టాలని ప్రయత్నం చేస్తే ... ఆ బురద మీమీదే పడుతుందని బాబు హెచ్చరించారు.
అంతెందుకు... జగన్ లాగే వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ హయాంలో జరిగిన పీపీఏల ఒప్పందంపై ఐదేళ్ల పాటు సమీక్షలు జరిపి జరిపి చివరకు ఏం లేదని తేల్చినట్లు చెప్పారు. నేను ఏం చేసినా పక్కాగా చేస్తాను, ప్రజా ప్రయోజనాలు ఆలోచించి చేస్తాను. అందుకే వైఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించక చివరకు ఆయనే తనకు క్లీన్ చిట్ ఇచ్చారని బాబు వివరించారు.
జగన్ ఏ రోజూ రాష్ట్రం గురించి పట్టించుకోరు కాబట్టి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ రంగంలో మాత్రమే దాదాపు 137 అవార్డులు వచ్చాయని.. ఈ ఘనత వేరే ఏ రాష్ట్రానికీ దక్కలేదని చంద్రబాబు చెప్పారు. విద్యుత్ శాఖను కుప్పకూల్చొద్దని, నేటి కాలంలో విద్యుత్ తో ప్రజల జీవితాలు, ఉపాధి ముడిపడి ఉన్నాయని చంద్రబాబు హితవు పలికారు.