నీకెందుకు కేటీఆర్? బాబుపై ఈ రకమైన ఈ మాటలేంటి....?

July 15, 2019

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు చూసి ఆశ్చర్య పోతున్నాయి తన సొంత పార్టీ వర్గాలే. మరోవైపు ఈ మాటలు విని షాక్ అవుతున్నారు జనం, మీడియా వర్గాల వారు. తండ్రి బాటలోనే కేటీఆర్ కూడా రాజకీయంగా బాగానే ఎదుగుతున్నారు. పలు పబ్లిక్ మీటింగుల్లో కేసీఆర్ స్టైల్ లోనే జనాలను ఆకట్టుకోవడంలో కేటీఆర్ ఫుల్ సక్సెస్ అయ్యారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఈ మధ్య కాలంలో తెలంగాణ సమస్యలను వదిలేసి.. పక్క రాష్ట్రం ఏపీ గురించి, అక్కడి రాజకీయాల గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతుండటం జీర్ణించుకోలేక పోతున్నారు తెలంగాణ జనం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పక్క రాష్ట్రం వాడని చంద్రబాబును దూషించిన ఆయనే.. ఇప్పుడు పక్క రాష్ట్ర రాజకీయాలపై ఇంత శ్రద్ద ఎందుకు తీసుకుంటున్నారో మాత్రం అర్థం కావడం లేదు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడాల్సిన మాటలు కూడా కేటీఆరే మాట్లాడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దీంతో టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవహారం అనేది ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు పెద్ద పరీక్షగా మారింది. తెలంగాణ పత్రికలో ఏపీ వార్తలా? అని ప్రశ్నిస్తారు. అసలు ఏపీ వార్తలకు అంత ప్రాధాన్యత ఎందుకిస్తున్నారు? అని ఆయనే ప్రశ్నిస్తారు. తీరా చూస్తే ఆయనే ఏపీ రాజకీయాల గురించి పబ్లిక్ గా మాట్లాడుతుండటం మీడియా వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. పెద్దసారు తర్వాత అంతటోడైన చిన్నసారు చెప్పింది చెప్పినట్లుగా చేద్దాం.. అనవసరంగా కోపం తెప్పించొద్దని డిసైడ్ అయితే.. మీరిలా మాట మార్చేస్తే ఎలా సార్? ఒకవైపు ఏపీ వార్తలు వేయొద్దని చెబుతూనే.. మరోవైపు ఏపీ పాలిటిక్స్ మాట్లాడితే ఏమని అర్థం చేసుకోవాలి కేటీఆర్ సర్ అనేది మీడియా ప్రతినిధుల మదిలోని మాట.

తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ముక్తసరిగా తెలంగాణ గురించి మాట్లాడిన కేటీఆర్.. ఆ తర్వాత ఏపీ గురించి అంత ఎక్కువగా మాట్లాడటం చూస్తే.. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటానికా? అనే డౌట్ రాక మానదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ కేటీఆర్ విరుచుకుపడటం ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం మారిస్తే బాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన కేటీఆర్.. ప్రజల పట్ల నమ్మకం లేకనే ఢిల్లీలో వీధి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజాతీర్పును స్వాగతించాలి కానీ చంద్రబాబు మాదిరి గగ్గోలు పెట్టొద్దన్నారు. తాను గెలిస్తే సాంకేతికత భేష్ అని.. లేకుంటే ఈవీఎంలు తప్పు అని బాబు అనటం సరికాదన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి మరీ ఇంత చిల్లర అరుపులు ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. వంగి వంగి దండాలు పెట్టినప్పుడే బాబు పని అయిపోయిందని అందరికి అర్థమైందన్నారు.

రాజకీయంగా ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడం వ్యూహాల్లో భాగమే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. చంద్రబాబు ఇతనికి రాజకీయ ప్రత్యర్థి కాదు. తెలంగాణలో టీడీపీ ఊసే లేదు. బాబు గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే.. జగన్ మాట్లాడాలి కానీ నువ్వెంటి కేటీఆర్ ఇలా ముందడుగేసి మాట్లాడుతున్నావ్. జగన్ కి మాటలు రావనా? లేక ఏపీలో చక్రం తిప్పుదామనా? ఇగో ఇవే ఇప్పుడు సామాన్య మానవుడి ప్రశ్నలు.