సుధాకర్ కేసు-ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇరుక్కున్నట్టేనా

August 05, 2020
CTYPE html>
కేవలం ఒక విమర్శ చేసినందుకు డాక్టర్ సుధాకర్ కు పట్టిన గతి పాలకుల నియంతృత్వానికి అద్దంపడుతోంది. మీడియాతో, జడ్జిలతో, బంధువులతో చాలా స్పస్టంగా అన్ని విషయాలపై కూలంకుషంగా తెలివితో మాట్లాడుతున్నట్లు సుధాకర్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. కానీ ఎందుకో అతనిని విశాఖ మానసిక ఆస్పత్రి వైద్యులు ఇంటికి పంపడం లేదు. దీంతో మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు డా.సుధాకర్‌ లేఖ రాశారు.

సుధాకర్ లేఖ ఏముంది?
విశాఖ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్‌ రాసిన లేఖలో ప్రతి విషయం కూలంకుషంగా వివరించారు. మాస్కుల విషయం నుంచి అన్ని అంశాలను లేఖలో ఆయన సుధాకర్ గొడవ ఎక్కడ మొదలైనదీ, ప్రభుత్వం తనతో ఎలా వ్యవహరించినదీ కూడా వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... సాధారణంగా ఉన్న తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని, తనకు ఆ మందులపై అవగాహన ఉందని... తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చారో లేఖలో వివరించారు.
తనకు అవసరం లేని మందులు బలవంతంగా ఇవ్వడం వల్ల తన శరీరంపై ఇవి దుష్ప్రభావాలు చూపిస్తున్నాయని సుధాకర్ వాపోయారు. ఈ మందులు తీసుకోవడం వల్ల పెదవిపై వచ్చిన మార్పులు చూపిస్తూ ఆ ఫొటోలు సుధాకర్ విడుదల చేశారు. వీటి వల్ల ఆరోగ్యంగా ఉన్న తనకు కొత్తగా యూరిన్‌ సమస్య కూడా తలెత్తిందని లేఖలో సుధాకర్ వివరించారు. 
తాను ఆరోగ్యంగా ఉండాలంటే.. తనను వెంటనే వేరే ఆస్పత్రికి రిఫర్‌ చేయాలని డా. సుధాకర్ విజ్జప్తి చేశారు. తన మానసిక స్థితి సరిగానే ఉందని లేఖలో వివరించిన సుధాకర్ అనవసరమైన వైద్య సేవలపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు.  
కాగా... డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. పోలీసులు ఇచ్చిన రిపోర్టు తప్పుల తడకగా ఉందని నిరూపించిన కోర్టు ప్రభుత్వంపై నమ్మకం లేదని సుధాకర్ కేసు అప్పగించింది. ఈ అనూహ్య పరిణామాన్ని వైసీపీ సర్కారు  ఊహించలేదు. ఇపుడు ఇది జగన్ తలకు చుట్టుకుంది.
 
Image