సుధాకర్ కేసులో సంచలన ట్విస్టులు

August 03, 2020

ఏపీలో డాక్టర్ సుధాకర్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ మలుపులు ప్రభుత్వాన్ని ఒకసారి, బాధిత కుటుంబాన్ని ఒకసారి, విపక్షాలను ఒకసారి... మీడియాను ఒకసారి ఇలా అందరికీ షాకులిస్తున్నాయి. కొత్త కొత్త మలుపులతో రోజురోజుకు ఆసక్తికరమైన అప్ డేట్స్ వస్తున్నాయి. తాజా సంచలనం ఏంటంటే... సుధాకర్ కు జరిగిన అన్యాయాన్ని విచారించడానికి రంగంలోకి దిగిన సీబీఐ డాక్టరు సుధాకర్ పై కేసులు నమోదు చేయడం సంచలనం అయ్యింది. 

ఈ సందర్భంగా సుధాకర్ కేసులో  అప్ డేట్స్ చూస్తే...

1. సుధాకర్ మాస్కుల కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

2. ప్రభుత్వ అధికారులు తనిఖీల్లో సుధాకర్ చెప్పింది నిజమే అని తేలింది.

3. సుధాకర్ సస్పెండ్ అయ్యారు. 

4. డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ ఆర్డరు ఒక డ్రైవరుతో ఆయనకు పంపారు.

5. సుధాకర్ డిప్రెషనుకు గురయ్యారు.

6. పలువురు వైసీపీ మద్దతుదారులు సుధాకర్ కు ఫోన్లు చేసి వేధించడం మొదలుపెట్టారు.

7. సుధాకర్ సడెన్ గా వైజాగ్ రోడ్డుపై పోలీసుల చేతిలో తన్నులు తింటూ కనిపించారు.

8. సుధాకర్ ప్రభుత్వాన్ని తిట్టాడన్న నెపంతో పిచ్చాసుపత్రికి తరలించారు. 

9. సుధాకర్ కు ప్రతిపక్షాలు అండగా నిలిచాయి. 

10. హైకోర్టు దీనిని సుమోటాగా తీసుకుని సంచలన రేపింది.

11. విచారణ క్రమంలో ప్రభుత్వం తప్పుడు నివేదిక ఇచ్చిందని హైకోర్టు నిర్దారించుకుంది

12. రాష్ట్ర సర్కారుపై నమ్మకం కలగడం లేదంటూ హైకోర్టు సీబీఐకి కేసును బదిలి చేసింది.

13. ప్రభుత్వం ఉద్యోగం తిరిగిస్తామని బేరసారాలాడినట్లు సుధాకర్ తల్లి తెలిపింది.

14. సీబీఐ విచారణ మొదలు పెట్టింది. ఇది అందరికీ ట్విస్టులా మారింది.

15. ప్రభుత్వ తప్పిదాలపై మొదట దర్యాప్తు మొదలుపెట్టింది సీబీఐ.

16. తాజాగా కానిస్టేబుల్ వెంకటరమణ ఫిర్యాదుతో   353, 427, 506 సెక్షన్ ల కింద సీబీఐ డాక్టరు సుధాకర్ పై కేసు నమోదు చేసింది.

17. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు దీనిపై స్పందించకూడదని ప్రతిపక్షాలు సైలెంట్ అయ్యాయి.