6 కోట్ల ఏపీ ప్రజలకు అర్థంకానిదిదే!

June 03, 2020

12 మంది ప్రాణాలు తీసిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటనలో 2000 మంది ఆస్పత్రి పాలయ్యారు. స్థానికంగా నివసించే వేలాది ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడే విషవాయువును పీల్చారు. ఇంతటి ఘోరానికి కారణమైన కంపెనీ ప్రతినిధులను గాని, యాజమాన్యంని గాని, డైరెక్టర్లను గాని ఒక్కరిని అరెస్టు చేయలేదు. కనీసం తిట్టలేదు.

మాస్కులు అడిగిన ఒక డాక్టరుకు ప్రతిరోజు బెదిరింపు కాల్స్ చేసి వేధించి అతన్ని మానసికంగా హింసించి భయపెడితే అతను ప్రశాంతత కోసం తాగితే... రోడ్డు మీద ట్రాఫిక్ జాం చేస్తావా? అంటూ తాళ్లతో కట్టేసి, లాఠీలతో కొట్టి, రోడ్డుమీద చొక్కా విప్పి పడుకోబెట్టి తీవ్రంగా హింసించి ఎందుకు అరెస్టు చేశారు. 

ఎల్జీ పాలిమర్స్ వల్ల సమాజానికి, ప్రజలకు నష్టం జరిగితే అరెస్టులు ఉండవు

వైసీపీ వేధింపుల వల్ల ఒక వ్యక్తి తాగినందుకు అరెస్టు చేస్తారా? 

ఏ చట్టం ప్రకారం... ఎల్జీ పాలిమర్స్ వారిని ఏమీ అనడం లేదు?

ఏ చట్టం ప్రరకారం... డాక్టరు, దళితుడు అని తెలిసి కూడా తాళ్లతో కట్టేసి రోడ్డుపై పడుకోబెట్టారు?

ఈ ప్రశ్నలకు ఎవరి దగ్గరైన సమాధానం ఉందా? 

కసబ్ కు మర్యాద ఇచ్చిన దేశంలో డాక్టరుకు ఇంత అవమానమా? 

డాక్టరు తాజా వీడియో : 

 https://twitter.com/i/status/1261738722149560320