సీఎం జగన్ కి ఒకే రోజు రెండు షాకులు

May 29, 2020

ముఖ్యమంత్రి జగన్ కి ఈరోజు రెండు షాకులు తగిలాయి. ఈ రెండూ డాక్టరు సుధాకర్ అమానవీయ అరెస్టుపైనే కావడం విశేషం. అసలు చట్టంలో లేని విధంగా డాక్టరు సుధాకరును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు జగన్ కి రెండు వైపుల నుంచి షాకులు తగిలాయి.

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖపట్నంలో పోలీసులు దారుణంగా ప్రవర్తించారని, వైద్యుడి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు తప్పుగా ఉందని, దేశ వ్యాప్తంగా డాక్టర్లను మనోవేదనకు గురి చేసేలా ఉందని...   సీఎం జగన్‌కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది. ఈ ఘటనను చూసిన వైద్యులంతా ఆందోళనకు గురవుతున్నారని పేర్కొంది. 

ఇదిలా ఉండగా... 

తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షరాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాస్తూ డాక్టరు సుధాకర్ కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు. దీనిపై ఇప్పటికే జాతీయ మీడియాలో కూడా రావడంతో కోర్టు వెంటనే దానిని విచారణకు స్వీకరించి డాక్టర్ సుధాకర్‌ని బుధవారం హైకోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. తల్లికి కొడుకును చూసే అవకాశం ఎందుకు కల్పించలేదని హైకోర్టు ప్రశ్నించింది.  ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

ఒకవైపు 65 ఏళ్ల వృద్ధురాలిపై సాధారణ సందేహాలు వ్యక్తంచేసినందుకు కేసు పెట్టి అందరితో తిట్టించుకున్న ప్రభుత్వం సుధాకర్ కేసులో కూడా దేశ వ్యాప్తంగా బ్లేమ్ అయ్యింది.