సుధాకర్ తల్లి మాటలు అందరినీ కదిలించాయి

May 29, 2020

ఈ కాలంలో డబ్బున్న వారే డాక్టరు అవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఒకపుడు అయితే అది కేవలం సంపన్నులకే సాధ్యం అయ్యేది. అలాంటిది అట్టడుగు వర్గం నుంచి వచ్చిన కుటుంబం ఎంత కష్టపడి చదివితే డాక్టరు అయ్యుంటారు. ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు. 25 సంవత్సరాలు డాక్టరుగా పనిచేసిన వ్యక్తిని చేయని తప్పునకు రోడ్డు మీద బట్టలు విప్పి తాళ్లతో కట్టి కొడుతుంటే ఆ తల్లిగుండెలు ఎంత బద్దలై ఉంటాయి? ఇది వర్ణణాతీతం.

వారు పడిన వేదన ఎవరూ ఓదార్చలేనిది. హైకోర్టు సుధాకర్ కేసు విషయంలో తీసుకున్న నిర్ణయంపై తల్లి కావేరీ బాయి భావోద్వేగానికి గురయ్యారు. హైకోర్టు తీర్పు సంతోషంగా ఉందని, మాకుమారుడికి న్యాయంజరుగుతుందని నమ్మకం కలిగిందన్నారు. పరువు పోయిన చోటే మళ్లీ దక్కాలని కోరుకంటున్నాం, అంతకుమించి మాకేమీ అవసరం లేదన్నారు ఆమె. 

మాకు సాధారణ ప్రజలు అండగా ఉన్నారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదు. కష్టపడి చదివి ఉన్నతంగా ఎదిగిన మా అబ్బాయికి ఇలాంటి కష్టం వస్తుందని ఏనాడూ అనుకోలేదు. మా కుమారుడి పట్ల పోలీసుల తీరు చూసి ఎంత క్షోభ పడ్డామో మాకు తెలుసు. న్యాయవ్యవస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది. మాకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఆమె అన్నారు. సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్జతలు చెబుతున్నాను అని కావేరి బాయి అన్నారు.

 Dr. Sudhakar Mother Face to Face over His Son Incident ... 

Read Also

వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ లడ్డూ వ్యాపారం !!
సుధాకర్ కేసు: హైకోర్టులో ఏం జరిగిందంటే
హైకోర్టు సంచలనం... సుధాకర్ కేసు సీబీఐకి