డాక్టర్ సుధాకర్ ని ఎక్కడికి తరలించారో తెలుసా?

June 04, 2020

ఆస్పత్రిలో మాస్కులు లేవని కంప్లయింట్ చేస్తే ఇంత ఘోరం జరుగుతుందని తెలిస్తే కచ్చితంగా ఆ డాక్టరు ఆ ప్రశ్నే అడిగి ఉండేవాడు కదా. మాట్లాడే స్వేచ్ఛ, రాజ్యాంగం, మానవ హక్కులు, వైద్యుడికి హక్కులు ఉంటాయని భయపడి ఉన్న నిజాన్ని చెప్పారు. మాస్కులు, పీపీఈ కిట్లు లేవు. కరోనా రోగులు వస్తే ఎలా వైద్యం చేయాలి అని ప్రశ్నించాడు. అంతే ఆ ప్రశ్నతో అతని జీవితం తలకిందులైపోయింది.

చట్టంలో కూడా లేని శిక్ష ను డాక్టర్ సుధాకర్ కు వేశారు పోలీసులు. తాగితే ఈ దేశంలో నేరం కాదు. కారు రాంగ్ పార్కింగ్ చేస్తే కేవలం జరిమానా వేస్తారు. పోనీ ఆ డాక్టరు ఈ రెండు తప్పులు చేశాడనుకుందాం... దానికి ఇలాంటి శిక్షలు చట్టంలో లేవేే. చేతులు విరిచి వెనక్కు కట్టి కొట్టాల్సింది ఎవరినో తెలుసా?అక్కడున్న వారి ప్రాణాలకు రక్షణ లేనపుడు తక్షణం నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి చేసే ప్రయత్నంలో మాత్రమే అలా చేస్తారు. మరి సుధాకర్ వల్ల ఆ రోడ్డుపై ఎవరి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది? అతను సాయుధుడు కాదు. ఒక బక్కపల్చటి వైద్యుడు. ముఖ్యమంత్రిని విమర్శించాడు. అయినా అదేం నేరం కాదు. గతంలో జగన్ చంద్రబాబును ఏకంగా ఉరేయాలన్నాడు. విజయసాయిరెడ్డి అయితే బాబును బూతులు తిట్టాడు. రోజా, నాని ల తిట్లు గురించి ఇక వేరే చెప్పాల్సిన అవసరమే లేదు.ఇక తీవ్రంగా వేధించి ఆ డాక్టరు సుధాకర్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 353, 427 ల కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అంతకుమునుపు సుధాకర్ మానసిక స్థితి బాగోలేదని, మెంటల్ ఆస్పత్రికి తరలించాలని కేజిహెచ్ సూపరింటెండెంట్ అర్జున రిఫర్ చేశారు. ఆ మేరకు పోలీసులు అతన్ని మెంటల్ ఆస్పత్రికి తరలించారు. 
దీనిపై స్పందించిన టీడీపీ సుధాకర్ ను మెంటల్ ఆస్పత్రికి తరలించడం పెద్ద కుట్ర అని విమర్శించింది. ప్రశ్నించిన పాపానికి ఒక దళిత డాక్టరుపై దాడి చేయించిన ప్రభుత్వ తమ అరాచకాన్ని కప్పి పుచ్చుకోవడానికి అతని మానసిక పరిస్థితి బాలేదని కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. ఆంధప్రదేశ్ లో ఎవరికీ రక్షణ లేదని మాజీమంత్రి టీడీపీ నేత జవహర్ ఒక రోజు దీక్షకు దిగారు. జై జగన్ అనే వారికి మాన ప్రాణ రక్షణ ఉంటుంది గాని మిగతా ఎవరికీ ఏపీలో రక్షణ లేదని ఆయన విమర్శించారు.