వైఎస్‌ఆర్‌సీపీ విజయోత్సవ సభగా దివంగత వైఎస్‌ఆర్‌ 70వ జయంతి

August 07, 2020

జననేత, దివంగత ముఖ్య వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 70వ జయంతిని వైఎస్‌ఆర్‌సీపీ విజయోత్సవ సభగా బే ఏరియాలో ఘనంగా నిర్వహించారు. మిల్పిలాస్‌ ఐసీసీలో వైసీపీ యొక్క జెండా, ఫ్లెక్సీలతో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ఆకర్షణీయంగా ఆ ప్రాంగణాన్ని అలకరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు సందడి చేయడంతో పాటుగా మ్యాజిక్‌ షో, కరోకే, తెలుగు పాటలతో అట్టహాసంగా నిర్వహించారు.

జూలై ఏడో తేదీ ఆదివారం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, సినీనటుడు, భక్తి టీవీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌, డాక్టర్‌ హన్మిరెడ్డి లక్కిరెడ్డి, జ్యోతిప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.ఈ సందర్భంగా డాక్టర్‌ హన్మిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని మరియు మైలవరంలో కృష్ణప్రసాద్‌ గెలుపుకోసం తను ప్రయత్నం చేసి విధానాన్ని పంచుకున్నారు. వైఎస్‌ జగన్‌ విజయం, గత 30 రోజులుగా వైఎస్‌ జగన్‌ పాలనపై స్పందిస్తూ అవినీతి రహిత పాలనను జగన్‌ అందిస్తున్నారని వెల్లడించారు. మైలవరం ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు.

ఈ సందర్భంగా సినీనటుడు పృథ్వీరాజ్‌ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర యొక్క అనుభవాలను పంచుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు జగన్‌ అనుభవించిన కష్టాలు వివరించారు. జగన్‌ను సీఎం చేసిన ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన పృథ్వీ రాబోయే 20 సంవత్సరాల పాటు ఆయన సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా శ్రీ లక్కిరెడ్డి హన్మిరెడ్డి అభినందనలో పాలుపంచుకోవాలని ఇరువురు అతిథులను సురేష్‌ ఉయ్యూరు కోరారు. 200 ఎకరాల్లో అమెరికాలో మెర్సిడ్‌లో సాగు చేస్తున్న విధానాన్ని అభినందించారు. రైతు దినోత్సవం సందర్భంగా ఆయన్ను అభినందించడం సంతోషకరమని పేర్కొన్నారు.
చివరగా మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. వైసీపీతో తన అనుబంధాన్ని పంచుకున్న ఆయన నవరత్నాల ద్వారా ప్రజలకు జరిగే మేలు గురించి వివరించారు. మైలవరం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎన్నారైలు చేస్తున్న చర్యలను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా పృథ్వీని ఉమా కొండూరి శాలువతో అభినందించారు. రామారావు జ్ఞాపిక అందించారు. కృష్ణప్రసాద్‌ను అబ్దుల్‌ శాలువాతో సత్కరించగా రామకృష్ణారెడ్డి ఆయనకు జ్ఞాపిక బహుకరించారు.
ఉమాశంకర్‌ మారెడ్డి, వీర సురవరం, హనిమి మేరువ, రాజేందర్‌ చావా, రమానాథ్‌, వెంకట్‌ పులుసు, శంకర్‌ అతిథులకు ఆహ్వానం పలికారు. హరి అర్రనాగు, పార్వతి, లక్షీ ఆల్ల అతిథులను స్టేజీపైకి ఆహ్వానించారు. అంజిరెడ్డి కుడుమల్‌,సీతారెడ్డి గోగులమూడి, శంకర్‌ అతిథుల బాధ్యతలను నిర్వహించారు.
నరేందర్‌ కొండూరి మరియు సత్యా కొండ నోరూరించే రుచులను సిద్ధం చేశారు. సురేష్‌ తనమల, అమర్‌నాథ్‌ బడే వేదిక సిద్ధం చేశారు. హరీందర్‌ సీలం అతిథుల శాలువాలు మరియు మెమెంటోలు సిద్దం చేశారు.సురేందర్‌ పులుగం మరియు ప్రవీణ డెకరేషన్‌కు సహకరించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవ, నరేందర్ కొత్త‌కోట, కరుణాకర్, నీలోతల్, లక్ష్మారెడ్డి మోర్తాలా, శ్రీనివాసరెడ్డి అవుతూ, రాజేందర్, వరప్రసాద్, ప్రవీణ్, సుగుణ, బంక విజయ భాస్కర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సుబ్బారెడ్డి అంకిరెడ్డి, జగదీష్, అనిల్, గాంధీ, లక్ష్మణ్, శ్రీనివాసులు పబ్బులేటి, ధర్మరాజు, సురేంద్ర, బిందు, ఝాన్సి, ప్రభాకర్ చాగంటి త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

link : https://photos.google.com/share/AF1QipMHGKD8BQARbyoKxVFHIcEzCzOz72fjK_FX4VPvXXkU3OpUQsWOPs1tUyjiLthcZw/photo/AF1QipO8w26LnoCe2cr7zqva6QJOVuTPQHRht-9wG3J1?key=TmdtZ09XZGZqcFpEOTktRVBGYlM4eDdpTmdSQzlR