వైజాగ్: డీఎస్పీ ఆత్మహత్య... కారణం ఇదేనా

May 31, 2020

ఏపీకి చెందిన స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కృష్ణవర్మ ఆత్మహత్య కలకలానికి దారితీసింది. ఆయన ఆత్మహత్య అందరినీ ఆశ్చర్యానికి గురించేసింది. భార్య తెలిపిన వివరాల మేరకు ఆయనకు శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణవర్మ శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేస్తున్నారు.

విశాఖ బీచ్ రోడ్డులోని ఆయన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఎటువంటి సూసైడ్ లేఖ దొరకలేదు. దీంతో భార్య ఇచ్చిన సమాచారాన్ని బట్టి అనారోగ్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు అర్థమవుతోంది. పోలీసులు మృదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలు ఏమై ఉంటాయన్నదానిపై దర్యాప్తు చేస్తున్నామన్నామని ఎంవీపీ ప్రాంత పోలీస్ స్టేషన్ సీఐ షణ్ముకరావు తెలిపారు.

ఇదిలా ఉంటే... సంఘటన బట్టి అర్థమవుతున్నది ఏంటంటే.. ఆయన విధుల్లో ఉన్న నేపథ్యంలో కరోనా థ్రెట్ కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అసలే శ్వాసకోశ వ్యాధులుండటం, ఇటీవలే గుండెకు ఆపరేషన్ కూడా జరగడం వల్ల... కరోనా సోకితే దారుణమైన మరణం చవిచూడాల్సి ఉంటుందని, బంధువులకు చివరి చూపు దక్కదేమో అన్న బాధ కూడా ఆయనను వేధించి ఉండొచ్చు. పోలీసు దర్యాప్తులో మరిన్ని కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.