పరారైన దుబాయ్ రాణి కథ చాలా ఇంట్రెస్టింగ్!

August 15, 2020

ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నుడిగా చెప్పే దుబాయ్ రాజు ఆరో భార్య ప్రిన్సెస్ హ‌యా బింత్ అల్ హుస్సేన్ పారిపోయిన తీరు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో పాటు భారీ ఎత్తున డ‌బ్బును తీసుకొని ఆమె వెళ్లిపోయిన వైనం దుబాయ్ రాజుకు కొత్త త‌ల‌నొప్పిగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ లో దుబాయ్ రాణి జ‌ర్మ‌నీలో ఆశ్ర‌యం పొందుతున్న‌ట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈ రెండు దేశాల మ‌ధ్య కొత్త వివాదం తెర మీద‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. రెండు దేశాల మ‌ధ్య ఇప్పుడు దౌత్య‌ప‌ర‌మైన సంక్షోభం త‌లెత్తే ప్ర‌మాదం ఉందంటున్నారు.
త‌ర‌చూ సేవా కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంటూ.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న పోస్టుల‌తో ఆక‌ట్టుకునే రాణి.. మే 20 నుంచి బ‌య‌ట‌కు రావ‌టం లేదు. ఫిబ్ర‌వ‌రి నుంచి ఆమె సోష‌ల్ మీడియా ఖాతాలుయాక్టివ్ గా లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఒక జ‌ర్మ‌నీ దౌత్య‌వేత్త సాయంతోనే ఆమె దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.
ఆమె ఎక్క‌డికి పారిపోయింద‌న్న దానిపై భిన్న క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఆమె లండ‌న్ పారిపోయిన‌ట్లుగా కొంద‌రు చెబుతుంటే.. లేదుజ‌ర్మ‌నీలో రాజ‌కీయ శ‌ర‌ణార్ధిగా ఉన్నారంటున్నారు. ఆక్స్ ఫ‌ర్డ్ లో చ‌దువుకున్న హ‌యా.. తాను పారిపోయే స‌మ‌యంలో త‌న ఇద్ద‌రు పిల్ల‌ల (ప‌ద‌కొండేళ్ల జ‌లీలా.. ఏడేళ్ల జాయేద్‌) తో క‌లిసి వెళ్లిపోయారు. అంతేకాదు.. త‌న‌తో పాటు 31 మిలియ‌న్ పౌండ్ల‌ను కూడా ఆమె తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. ఇంత భారీ మొత్తాన్ని ఆమె తీసుకెళ్లిపోయిన వైనం దుబాయ్ రాజు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా స‌మాచారం.
త‌న భార్య‌ను దుబాయ్ కు తిరిగి పంపాల్సిందిగా షేక్ హ‌మ్మ‌ద్ చేసిన విన‌తిని జ‌ర్మ‌నీ అధికారులు రిజెక్ట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. రాజుతో విడిపోవ‌టానికి రాణి సిద్ధంగా ఉన్న‌ట్లు చెబుతున‌నారు. ఇదిలా ఉంటే.. కొద్ది నెల‌ల క్రితం షేక్ కుమార్తెల్లో ఒక‌రైన ల‌తీఫా ర‌హ‌స్యంగా దేశం విడిచి పారిపోతున్న వేళ‌.. భార‌త తీరంలో ఆమె ప‌ట్టుబ‌డ‌టం.. ఆమె వ‌ద్దంటున్నా బ‌లవంతంగా భార‌త్ వ‌ర్గాలు ఆమెను ఆమె దేశానికి పంప‌టం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఆమె ఆచూకీ బ‌య‌ట ప్ర‌పంచానికి తెలీటం లేదు. ఆమెను బంధీగా ఉంచిన‌ట్లుగా హ‌క్కుల సంస్థ‌లు ఆరోపిస్తున్నాయి. తాజా ఎపిసోడ్ లో దుబాయ్ రాణికి ఆశ్ర‌యం ఇచ్చిన జ‌ర్మ‌నీ రానున్న రోజుల్లో ఎలాంటి ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటుందో చూడాలి.