ప‌బ్లిక్ మీటింగ్‌లో బాబు, ప‌వ‌న్‌ల‌పై వైసీపీ ఎమ్మెల్యే నీచ‌మైన వ్యాఖ్య‌లు

February 23, 2020

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండాల‌న్నా.. ఆ పార్టీలో చేరాల‌న్నా ప్ర‌త్య‌ర్థి పార్టీల వాళ్ల‌ను బూతులు తిట్టి తీరాలేమో. మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్లే బూతులు వాడుతుంటే.. ఇక ఎమ్మెల్యేలు ఎందుకు త‌గ్గుతారు. జ‌గ‌న్ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన ఏడు నెల‌ల్లో వైకాపా నేత‌లు చాలామంది అదుపు త‌ప్పి మాట్లాడారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మ‌రీ శ్రుతి మించారు. తెలుగుదేశం అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌పై వార్త‌ల్లో రాయ‌లేని బూతు వ్యాఖ్య‌ల‌తో రెచ్చిపోయారు. దొంగ‌నాకొడుకు, లం..కొడుకు లాంటి ప‌దాల్ని ఎమ్మెల్యే ప్ర‌యోగించ‌డం గ‌మ‌నార్హం.
మూడు రాజధానులతోనే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమంటూ కాకినాడలో వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ వంగా గీతతో పాటు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ‌నం మ‌ధ్య ర్యాలీలో ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌ల‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తన బినామీలకోసమే బస్సు యాత్ర చేస్తున్నారన్న ద్వారంపూడి ఆయ‌న్ని లం..కొడ‌కా అని తిట్టాల‌నుంద‌న్నారు. లోకేష్‌ను ప‌ప్పు గాడు అని సంబోధించిన ఎమ్మెల్యే.. వాడి కొవ్వు క‌రిగేలా బుద్ధి చెప్పాలి అన్నారు. ప‌వ‌న్ గురించి మాట్లాడుతూ.. అత‌నో ప్యాకేజీ స్టార్ అని.. లం..లా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని వ్యాఖ్యానించిన ద్వారంపూడి జ‌న‌సేన అధినేత‌ను దొంగ‌నాకొడుకు అనే మాట కూడా అన్నారు.