కన్ఫ్యూజన్లో మోడీ... సీఎంలు అంతకుమించి

May 31, 2020

ప్రారంభం ఎక్కడున్నా పర్లేదు... ముగింపునకు మాత్రం పక్కా ప్లాన్ ఉండాలి. కరోనా విషయంలో మొదట్నుంచి మన దేశం కన్య్ఫూన్లోనే ఉంది. లాక్ డౌన్ విధించారు. కరోనా ఆగిపోతుందని సైలెంటుగా కూర్చున్నారు. కానీ... వ్యాప్తిని ఆపడానికి సరైన ప్రణాళికతో పనిచేయలేదు. మూడు లాక్ డౌన్లు విధించినా ఉపయోగం లేకపోయేటప్పటికి ... అసలు దీన్ని ఏం చేయాలో, ఎలా ఎగ్జిట్ అవ్వాలో తెలియని అయోమయంలో ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

కేసులు లేనపుడు లాక్ డౌన్ పెట్టి... భారీగా కేసులున్నపుడు లాక్ డౌన్ ఎత్తేయడం ఏంటి అన్న ప్రాథమిక ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. చివరకు మోడీ - ముఖ్యమంత్రులు ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. చివరకు 4 రోజుల్లో మీ ప్లానేంటో చెప్పండని... సీఎంలకు టాస్క్ ఇచ్చారు మోడీ. 

ఇక తనపై వలస కూలీల విషయంలో గాని, ఇతర తప్పిదాల్లో గాని పడిన మచ్చలను చెరపడానికి ఉన్న ఒకే బ్రహ్మాస్త్రం మోడీ ఈరోజు ప్రయోగించాడు. కొన్ని సంపన్నదేశాలతో సమానంగా జీడీపీలో 10 శాతాన్ని మోడీ ఆర్థిక ప్యాకేజీ కింద ప్రకటించారు. 20 లక్షల కోట్లను ప్రకటించారు. మోడీ మచ్చ సంగతి ఓకే... మరి దేశం పరిస్థితి ఏంటి? దీనిని ఎలా బయటపడేస్తారు ఈ కరోనా నుంచి, వీరికి ఎప్పటికి క్లారిటీ వస్తుంది? వీటికి ఇపుడే సమాధానాలు దొరకవు గాని.... నేతల అమోమయం గురించి ఈ వీడియో చూడండి.