అమ్మాయి కత్తిలా ఉంది... బుర్ర మాత్రం జీరో !

August 10, 2020

ఇమేజ్ పెంచుకోవటానికి ఇష్టారాజ్యంగా వ్యవహరించటం ఇప్పుడో అలవాటుగా మారింది. లైకులు..షేర్లు.. కామెంట్లే లక్ష్యంగా వ్యవహరించే సెలబ్రిటీలతో పాటు.. మరికొందరు విచ్చలవిడితనాన్ని ప్రదర్శించే వారు కనిపిస్తారు. తాజాగా అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న బెల్లీ డ్యాన్సర్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. మూడేళ్ల జైలుతో పాటు.. భారీ జరిమానాను విధించటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడ చోటు చేసుకున్నదంటే?
ఈజిప్టుకు చెందిన బెల్లీ డ్యాన్సర్ సామా ఎల్ మస్త్రీ. టిక్ టాక్..  యూట్యూబుల్లో తనకు సంబంధించిన వీడియోల్ని పోస్టు చేయటం ఆమెకు అలవాటు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె పోస్టు చేసిన వీడియోలు..ఫోటోలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే.. సదరు ఫోటోలు.. వీడియోలు అనుచితంగా ఉండటమే కాదు.. లైంగిక సంప్రదాయాల్ని దెబ్బ తీసేలా ఉండటంతో పాటు విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా ఆమెపై కేసు నమోదైంది. దీంతో ఆమెను ఆ మధ్యన పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామానికి ఆమె షాక్ తింది. ఏదో ఇమేజ్ పెంచుకుందామనుకుంటే.. రివర్స్ గేర్ లో కేసులు.. అరెస్టులు చోటు చేసుకోవటంతో ఉక్కిరిబిక్కిరైంది. దీంతో.. తనకే పాపం తెలీదని వాదించటం షురూ చేసింది. ఇదిలా ఉంటే.. ఆమెపై నమోదైన కేసుల్ని విచారించిన న్యాయస్థానం ఆమెకు పద్నాలుగు లక్షల రూపాయిల జరిమానాతో పాటు.. మూడేళ్ల జైలుశిక్షను విధించటం ఇప్పుడు సంచలనంగా మారింది.
తనకు విధించే శిక్ష ఇంత తీవ్రంగా ఉంటుందని ఏ మాత్రం ఊహించని ఆమె.. ఇప్పుడు లబోదిబోమంటోంది.తనకే పాపం తెలీదని.. తన ఫోన్ లోని వీడియోల్ని.. ఫోటోల్ని ఎవరో దొంగలించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారని వాపోతోంది. తనకే పాపం తెలీదని చెప్పే ఆమె.. తన ఫోన్లో మాత్రం ఆ తరహా వీడియోలు.. ఫోటోల్ని ఎందుకు సేకరిస్తున్నట్లు చెప్మా?