దొంగ ఓట్ల తాటతీసే అధికారమివ్వండి ప్లీజ్

April 01, 2020

కేంద్రానికి ఎన్నికల కమిషన్ ఒక రిక్వెస్ట్ పెట్టింది. ప్రతిరాష్ట్రంలో లక్షల మందికి వేర్వేరు ప్రాంతాల్లో గాని వేర్వేరు రాష్ట్రాల్లో గాని రెండు ఓట్లు ఉన్నాయని.. వాటిని తొలగించే ప్రయత్నానికి సహకరించమని కోరింది. ఓటరు కార్డును ఆధార్ కు అనుసంధానం చేయడం వల్ల దేశంలో ఎక్కడైన ఒకచోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండేలా కంట్రోల్ చేయవచ్చని ఎన్నికల సంఘం చెబుతోంది. అందుకోసం ఆధార్ కార్డును ఓటరు కార్డుతో లింకు చేసే అధికారం కల్పించాలని కోరింది.
ఎన్నికల సంఘం గతంలో ఈ ప్రక్రియ మొదలుపెట్టినా ఆధార్ దుర్వినియోగం పై సుప్రీంకోర్టులో కొందరు కేసు వేశారు. అందులో భాగంగా ఎన్నికల సంఘం ఎవరైనా తమంతట తాము ఓటరు ఆధారును అనుసంధానిస్తే ఆ పనిచేయొచ్చు గాని ఓటరు ను ఆధార్ అనుసంధానం చేయమని కోరే హక్కు లేదు. దీంతో అందరూ దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారు. ఈ అధికారం కనుక ఎన్నికల సంఘానికి ఇస్తే... దేశంలో ఓట్లన్నీ అనుసంధానించి ఒక్కొక్కరికి ఒకే ఓటు ఉండేలా చేయొచ్చు. తద్వారా ప్రజాస్వామ్యంలో దొంగ ఓటు అనేది లేకుండా చేయొచ్చు. అందుేక కేంద్రానికి ఎన్నికల సంఘం ఈ రిక్వెస్టు పెట్టింది.