​ఈసీ అరాచకం - సుప్రీంకోర్టు సీరియస్

July 08, 2020

ఎన్నికల సంఘం తీరుపై దేశంలో ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవమే. ​ప్రతి రాష్ట్రంలో ఎంతో మంది ఈసీ తీరును విమర్శిస్తున్నారు. కొందరు కోర్టులకు ఎక్కుతున్నారు. మోడీ విషయంలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన పట్టించుకోని ఎన్నికల సంఘం మోడీ వ్యతిరేకుల పట్ల మాత్రమే కఠినంగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతోంది. అయితే... ఎన్నికల సంఘం నిబంధనల్లో ఒక దారుణమైన నిరంకుశ నిబంధనపై తాజాగా సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. అసలు ఆ నిబంధన ఇంతవరకు ఎవరూ గమనించకపోవడం విచిత్రం. ఆ నిబంధన రాజ్యాంగం పౌరుడికి ఇచ్చిన అన్ని ప్రాథమిక హక్కులను హరిస్తోంది. చివరకు సునీల్ ఆహ్యా అనే వ్యక్తి దీనిపై సుప్రీంకోర్టులో పిటిషను వేయడంతో విచారణకు స్వీకరించిన కోర్టు ఈసీకి నోటీసులు జారీచేసి వివరణ కోరింది.

ఇంతకీ ఏమిటా నిబంధన
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నపుడు సాధారణ పరిపాలన ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ఉంటుంది. ఈ నిబంధనల్లోని సెక్షన్ 49ఎంఏ ప్రకారం... ఈవీఎంలలో లోపాలు ఉన్నాయంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి దాన్ని కచ్చితంగా నిరూపించాల్సి ఉంటుంది. ఒకవేళ చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయినా, తప్పని రుజువైనా ఐపీసీ సెక్షన్ 177 ప్రచారం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
సాధారణంగా ఓటు వేసినపుడు ఎవరైనా ఓటరు దానిపై ఈవీఎంలో తేడా అనిపిస్తే కంప్లయింట్ ఇవ్వాలనుకున్నాడనుకోండి... మళ్లీ అతనే నిరూపించాలి. లేదంటే జైలుకు పంపుతాం అంటే ఎవరయినా కంప్లయింట్ ఇవ్వడానికి ముందుకు వస్తారా? ఎట్టి పరిస్థితుల్లో రారు. అంటే ఈవీఎంను ప్రశ్నించకూడదు అని పరోక్షంగా కంట్రోల్ చేసినట్టు ఉంది ఈ నింబధన. దీని పర్యవసానంగా ఎవరూ ఈవీఎంలపై మాట్లాడకపోతే దేశానికి జరిగే నష్టం ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ నిబంధన తొలగించాలని సునీల్ కోరుతున్నారు. సుప్రీంకోర్టు పిటిషనర్ ది న్యాయమైన ప్రశ్న... ఈ నిబంధన అంతు చూద్దాం అన్నట్టు వేగంగా విచారణ జరుపుతోంది.