సైలెంటుగా వస్తున్నాడు... సంక్రాంతి చేసేస్తాడేమో..

May 27, 2020

ఈసారికి సంక్రాంతికి అన్నీ భారీ సినిమాలే వస్తున్నాయి. వాటి మధ్యలో ధైర్యం చేసి వస్తున్నాడంటే.. ఎంత దమ్మున్నవాడవురా నువ్వు అనాలేమో కళ్యాణ్ రామ్ ని. గతంలో ఓ సంక్రాంతికి మంచి హిట్టిచ్చిన వేగేష్న సతీష్ దర్శకత్వంలో కళ్యాణ్ రావు ఈసారి ఎంత మంచివాడవురా అంటూ ముందుకు వస్తున్నాడు. ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే ఓ కుటుంబం కథ. తండ్రిని ప్రేమించే ఓ కొడుక కథ, కుటుంబాన్ని ప్రేమించే ఓ తండ్రి కథ. సంక్రాంతి అంటే... ఆప్యాయతలు బంధాలు గుర్తుకు తెచ్చే పండగ అని చెప్పొచ్చు. సరిగ్గా టైం చూసి కొడుతున్న ఈ ఇద్దరు నిలుస్తారా? గెలుస్తారా? సంక్రాంతి పండగ దర్జాగా చేసుకుంటారా లేదా అన్నది చూడాలి.

తాజాగా ఈరోజు జరిగిన ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మీరూ ఓ సారి చూసేయండి.