న‌లుగురు ఎన్నారైలు దుర్మ‌ర‌ణం

August 07, 2020

ప్ర‌పంచంలో భార‌తీయులున్న చోట ర‌వి అస్త‌మించ‌డు. అవును. ఇపుడు భార‌తీయులు లేని దేశ‌మే లేదు. అయితే, ఈ విష‌యం విషాద‌క‌ర‌మైన సంద‌ర్భంలో చెప్పుకోవాల్సి రావ‌డం బాధాక‌రం. ఆదివారం ఇథియోపియాలో జ‌రిగిన ఘోర విమాన ప్ర‌మాదంలో 157 మంది ప్ర‌యాణికులు ప్ర‌మాదంలో ప‌డ్డారు. దాదాపు అంద‌రూ చ‌నిపోయారు.  ప్ర‌పంచంలో ఏ దేశానికి వెళ్లే విమానంలో అయినా భార‌తీయులు క‌చ్చితంగా ఉండే ప‌రిస్థితి. అదేవిధంగా కూలిపోయిన ఈ ఇథియోపియా విమానంలోనూ భార‌తీయులు ఉన్నారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో న‌లుగురు భార‌తీయులు దుర్మ‌ర‌ణం చెందారు

ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నగరం నైరోబీకి వెళ్ల‌డం విమానం బ‌య‌లుదేరిన కొద్దిసేప‌ట్లోనే ఈ దుర్ఘటన జరిగింది. విమానంలో మొత్తం 157 మంది మ‌ర‌ణించారు.. పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. భార‌తీయుల వివ‌రాలు తెలుసుకోవ‌డానికి భారత విదేశాంగ శాఖ ప్ర‌య‌త్నిస్తోంది.