సినిమాల్లో హీరో...బయట విలన్

May 31, 2020

టాలీవుడ్ నటుడు.. ఎవడ్రా హీరో చిత్ర కథానాయుడు రహీం బషీద్ ను తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న అతగాడ్ని విచారణ కోసం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ.. ప్రైవేటు బ్యాంకుల్లో రుణాలు ఇప్పిస్తానని చెబుతూ డబ్బులు వసూలు చేస్తున్న ఫిర్యాదులు అందటంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
అతనిపైన కేసు నమోదు చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసలు బషీద్ ను అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.30లక్షలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇతగాడి మోసాలు భారీగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
దుబాయ్ లోని ఎస్ బీకే గ్రూపు పేరుతో నకిలీ వ్యాపారం చేసిన ఇతడిపై దుబాయ్ ఎంబసీ ఇచ్చిన కంప్లైంట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అతడ్ని అరెస్టు చేశారు. ఇతగాడి లీలలపై ఇప్పటికే నగరంలోని కూకట్ పల్లి.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇతడ్ని మరింత లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.