జగన్ సంచలన నిర్ణయం...

October 17, 2019

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్య విషయంలో దృష్టి పెట్టిన జగన్ అందులో ఏదైనా మార్పు చేయాలని గట్టిగా పదేపదే చెబుతున్నాడు. నిర్ణయాలు తీసుకోవడం సులువే గాని ఆటంకరహితంగా నిర్వహించడం కష్టసాధ్యమే. మరి రెండేళ్లలో అన్ని స్కూళ్లను మార్చి చూపిస్తాను అని చెప్పిన జగన్ తాాజాగా బడ్జెట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లిష్ మీడియం స్కూల్ గా మారుస్తున్నారు. దీనికోసం బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని చెప్పారు. అయితే, ఈ క్రమంలో తెలుగుకు ఎక్కడా ప్రాధాన్యం తగ్గకుండా తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామని ప్రకటించారు. ఇక ఇంగ్లిష్ మీడియం కోసం ప్రైవేటు స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తామని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. 

ప్రభుత్వం అత్యధికంగా విద్యా రంగానికి రూ.32,618 కోట్లు కేటాయించింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ‘జగనన్న విద్యా దీవెన’గా నామకరణం చేశారు. పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. జగనన్న అమ్మఒడికి రూ.6455 కోట్లు ఖర్చుచేయనున్నారు.