జగనన్న మద్యం రూల్స్

August 10, 2020

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ ఇపుడు ఆడోళ్లు కూడా తాగడం అలవాటుగా చేసుకుంటున్నారు. మద్యం అలవాటు సోషల్ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. ఈ నేపథ్యంలో మద్య పాన నిషేధం సాహసమే. కాకపోతే మంచిదే. ఈ నిషేధాన్ని బ్లాక మార్కెట్లో సొమ్ము చేసుకోవడానికి కాకుండా కఠినంగా అమలు చేస్తే సమాజానికి మంచిదే. ఇకపోతే మద్యం పాలసీ కొత్తది ఈరోజు నుంచి వచ్చేసింది. మరి ఈ పాలసీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

1. గ్రామాల్లో అన్ని బెల్టు షాపులు రద్దు.
2. ఎవరి వద్ద అయినా మూడు సీసాలకు మించి మద్యం ఉండకూడదు. తీసుకెళ్లకూడదు.
3. నాలుగోసీసాతో పట్టుబడితే కఠిన శిక్షలు ఖాయం. అది నేరం.
4. ఈరోజు నుంచి దుకాణాలన్నీ ప్రభుత్వానివే.
5. దుకాణంలో వారు తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగులు.
6. అన్ని మద్యం దుకాణాలకు పర్మిట్ రూంలు రద్దు.
7. రాత్రి 9 గంటలకే దుకాణాలన్నీ మూసివేస్తారు.
8. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరం. అరెస్టు చేస్తారు.
9. అన్ని రకాల మందు ఎమ్మార్పీ ధరకే దొరుకుతుంది.