FabiFlu : కరోనా చికిత్సకు మరో మందుకు ఇండియాలో అనుమతి

August 06, 2020

ఇటీవలి కాలంలో మనకు వినిపిస్తున్న అతికొన్ని శుభవార్తలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో కరోనా (COVID-19) చికిత్స కోసం గ్లెన్మార్క్ (Glenmark) కంపెనీ కి చెందిన ఫాబిఫ్లూ ( FabiFlu ) అధికారికంగా ఆమోదించబడింది. దీని ధర కూడా తక్కువే. ఒక టాబ్లెట్ 103 రూపాయలు.

భారతదేశంలో కరోనా ( COVID-19 ) రోగులకు చికిత్స చేయడానికి అధికారికంగా అనుమతించబడిన తొలి ఔషధం (Oral drug) ఇదే కావడం గమనార్హం. హైడ్రాక్సీక్లోరోక్విన్ మలేరియా డ్రగ్. ఫాబిఫ్లు (FabiFlu) కేవలం కరోనా కోసమే అభవృద్ధి చేసిన మందు.

ఈ మందు తయారీకి గ్లెన్మార్క్  ఫార్మా సంస్థ కు ప్రభుత్వం అనుమతిచ్చింది

14 రోజుల చికిత్సకు సరిపోయే 34 టాబ్లెట్లకు 3,500 రూపాయలు అవుతుంది. 

యుఎఈ ఇప్పటికే COVID-19 చికిత్స కోసం ఈ ఔషధాన్ని ఉపయోగిస్తున్నది.

గ్లెన్మార్క్ కంపెనీ సొంత పరిశోధనల్లో ఈ ఫార్ములాను అభివృద్ధి చేసింది.

 

 FabiFlu : ఇక మనలో కరోనా భయం పోగొట్టనుందా?