పవన్ పై ఎందుకు ఈ దాడి? అడ్డంగా దొరికిపోయారు

May 29, 2020

ఒక్క ఫోటో ఎన్ని సంచలన కథనాలకు కారణమైందో తెలుగుమీడియాలో చూశాం.

ఎన్నికల అనంతరం పవన్ గడ్డం గీసుకుని స్కూల్ బాయ్ లా తయారైన ఆ ఫొటో అందరూ షేర్ చేశారు.

ఇది  నిజమేనా ?

అసలు కథ ఏంటి?

ఆ ఫొటో పచ్చి అబద్ధం.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ అసలు గడ్డం గీసుకోలేదు. కానీ ఏదో ఒక పాత ఫొటో తీసుకొచ్చి రకరకాల కథనాలు రాసి, విమర్శలు చేస్తూ ఆయన ప్రతిపక్షాలు, వ్యతిరేకులు దుమ్మెత్తి పోశారు. కొందరయితే... ఇపుడు పొలిటికల్ షూటింగ్ అయిపోయింది... సినిమా షూటింగ్ కోసం వెళ్తున్నాడు అంటూ దారుణమైన విమర్శలు చేశారు. ఈ ఫొటో పుణ్యమా అని పవన్ పై నిత్యం ఎంత అసత్య ప్రచారం జరుగుతుందో అందరికీ అర్థమైపోయింది. ముఖ్యంగా పవన్ కి, పార్టీ శ్రేణులకి అర్థమైంది. తమది నెం.1 మీడియా అని చెప్పుకునే వాళ్లే ముందు ఆ ఫేక్ పొటోను ప్రచురించడం గమనించాలి. ఆ తర్వాత ఇంటర్నెట్లో ఎన్నికల అనంతరం పవన్ గడ్డం గీసుకున్నాడు ఫొటో షేర్ అయ్యింది.

వైసీపీ, వైసీపీ తరఫు మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఒక ప్రణాళిక ప్రకారం... పవన్ పై  దాడి చేస్తోంది. పవన్ తెలుగుదేశంతో సంబంధం లేకుండా పోటీ చేసినా పవన్ బాబు ఒకటే అని అసత్య ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు వైసీపీ గాని, దాని అధ్యక్షుడు జగన్ గాని చేయని ప్రయత్నమే లేదు. వాళ్లు చేసిన అసత్య ప్రచారానికి సాక్ష్యమే ఈ ఫొటో. 

కొన్ని టీవీ చానళ్లు కూడా ఈ ఫొటో పట్టుకుని కథలు అల్లేసి అరగంట ప్రోగ్రాంలూ నడిపించేశాయి. ఇక ఇదే అదను అదే పదును అనుకుంటూ పవన్ విమర్శకులు కూడా తమ నోళ్లకు పనిచెప్పారు.  ఇంకా ఎంత చేస్తారో చెయ్యనీ అంటూ పవన్ కళ్యాణ్  వెయిట్ చేస్తూ ఉన్నారట. ఏదైతే ఎన్నికల తర్వాత ఫొటో అంటూ అబద్ధం చెప్పారో.. అది గత నవంబరులో అన్నవరం దేవాలయానికి వెళ్లినప్పటి ఫొటో. అసలు ఈ ఇంటర్నెట్ యుగంలో మినిమం చెక్ చేసుకోకుండా ఇలాంటి కథనాలు రాస్తే... అది దాగదు.